HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabads Khajaguda Lake Is Now A Dumping Yard Why

Khajaguda Lake Misery : డంపింగ్ యార్డును తలపించేలా ఖాజాగూడ చెరువు

Khajaguda Lake Misery : ఖాజాగూడ చెరువును భగీరథమ్మ చెరువు అని కూడా పిలుస్తారు.. ఇది ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ కు  సెంటర్ పాయింట్లుగా ఉన్న నానక్ రామ్ గూడ, మణికొండ ఏరియాల మధ్యలో ఉంది.

  • By Pasha Published Date - 12:08 PM, Tue - 11 July 23
  • daily-hunt
Khajaguda Lake Become Dumping Yard
Khajaguda Lake Become Dumping Yard

Khajaguda Lake Misery : హైదరాబాద్ నగర ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు కొత్తగా చెరువుల నిర్మాణం జరగట్లేదు.. 

కానీ  ఉన్న చెరువులు కబ్జాల చెరలో చిక్కి మాయం అవుతున్నాయి.. 

126 ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక చెరువు ఈవిధంగా కుచించుకుపోతోంది.. 

చెత్త కుప్పలతో, ప్లాస్టిక్ వ్యర్ధాలతో డంపింగ్ యార్డుగా మారుతోంది..  

నగరంలో భారీ వర్షాలకు వరదలు సంభవించకుండా నీటిని నిల్వ చేసుకునే ఆ అతిపెద్ద బఫర్ జోన్ ఖాజాగూడ చెరువు. 

ఖాజాగూడ చెరువు..  భగీరథమ్మ చెరువు

ఖాజాగూడ చెరువు (Khajaguda Lake)ను భగీరథమ్మ చెరువు అని కూడా(Khajaguda Lake Misery) పిలుస్తారు.. ఇది ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ కు  సెంటర్ పాయింట్లుగా ఉన్న నానక్ రామ్ గూడ, మణికొండ ఏరియాల మధ్యలో ఉంది. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ హయాంలో 1897లో ఖాజాగూడ చెరువును నిర్మించారు. ఇది అప్పట్లో 618 ఎకరాల్లో విస్తరించి ఉండేదని అంటారు. ఖాజాగూడ చెరువు నుంచి కామారెడ్డి, సారంపల్లి, నర్సంపల్లి ప్రాంతాలకు కూడా తాగునీటిని సరఫరా చేసేవారు. దీన్నిబట్టి ఆ చెరువు కెపాసిటీ ఎంతగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఈ చెరువులో ఎన్నో రకాల జలచరాలు, వివిధ జాతుల నీటి మొక్కలు కూడా ఉండేవని అంటారు.

నాడు 618 ఎకరాలు.. నేడు 38 ఎకరాలు

కట్ చేస్తే.. ఇప్పుడు ఖాజాగూడ చెరువు కేవలం 38 ఎకరాలలో ఉంది. దీన్నిబట్టి గత 126 ఏళ్ళలో ఈ చెరువు పరిసర ప్రాంతాలు ఎంతగా కబ్జాకు గురయ్యాయో అర్ధం చేసుకోవచ్చు. ఆనాడు 618 ఎకరాలు.. ఈనాడు  38 ఎకరాలు .. మిగితా చెరువు శిఖం భూమి ఏమైంది ? ఎటు పోయింది ? అనేది పెద్ద ప్రశ్న!! గత ఏడేళ్లలో ఖాజాగూడ చెరువు (Khajaguda Lake) విస్తీర్ణం దాదాపు ఒక ఎకరం తగ్గిపోయిందని ప్రభుత్వ రికార్డులను బట్టి తెలుస్తోంది. కనీసం ఇప్పటికైనా ఈ చెరువును కబ్జాల నుంచి కాపాడాలంటే  .. దాని చుట్టూ పకడ్బందీగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి.

Also Read:  Samantha Treatment: హెల్త్ ట్రీట్ మెంట్ కోసం సమంత ఎన్ని కోట్లు ఖర్చుచేస్తోందో తెలుసా?

రియల్ ఎస్టేట్ బూమ్ గండం..

హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ, మణికొండ ఏరియాల్లో విపరీతమైన రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. ఈక్రమంలో ఖాజాగూడ చెరువు చుట్టూ కొత్త నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. వాటిలో ఖాజాగూడ చెరువు ఉనికిని దెబ్బతీసే నిర్మాణాలు ఏవైనా ఉంటే.. చెరువును ఆక్రమించే నిర్మాణాలు ఏవైనా ఉంటే  నిలువరించాల్సిన బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై ఉంది. ఆక్రమణలను తక్షణమే ఆపకపోతే త్వరలో ఖాజాగూడ చెరువు మరింత శిఖం భూమిని కోల్పోయే ముప్పు ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. నానక్ రామ్ గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ , ఔటర్ రింగ్ రోడ్‌ లను కలిపే రహదారిని నిర్మిస్తున్నప్పుడు ఖాజాగూడ సరస్సు బాగా దెబ్బతిందని గుర్తు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ వ్యర్ధాలు పడి చెరువు బాగా ఇంకిపోయిందని అంటున్నారు.

చెరువుకు కంచె కంపల్సరీ

ఖాజాగూడ చెరువు ఇప్పుడు ఒక డంపింగ్ యార్డును తలపిస్తోంది. చెరువు పరిసరాలు చెత్తా చెదారం, ఘన వ్యర్థాలతో నిండిపోయి కంపు కొడుతున్నాయి. రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలు వ్యర్థాలను తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఈ చెరువు దగ్గర వేసి వెళ్తున్నారు. చెరువు దగ్గర రోజూ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు అవుతుంటాయి. కనీసం డస్ట్‌బిన్‌లు కూడా లేకపోవడంతో ప్లేట్స్, ఆహార వ్యర్ధాలను చెరువు దగ్గర పడేస్తున్నారు. ఈవిధంగా చెత్త డంపింగ్‌ను అడ్డుకోవడానికి చెరువు చుట్టూ కంచె వేయాల్సిన అవసరం ఉంది.

Also Read:  Road Accident: యూపీలో స్కూల్ బస్సు-వ్యాన్ ఢీ: ఆరుగురు మృతి: Video


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dumping yard
  • GHMC
  • hyderabad
  • Khajaguda Lake
  • Khajaguda Lake Become Dumping Yard
  • Khajaguda Lake Misery
  • realty boom

Related News

Hilt Policy In Hyderabad

HILT Policy in Hyderabad : హిల్ట్ పాలసీ లీక్.. విచారణకు ప్రభుత్వం ఆదేశాలు !

HILT Policy in Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించిన కీలకమైన హిల్ట్ (HILT - హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్) పాలసీకి సంబంధించిన వివరాలు కసరత్తు దశలోనే

  • Brs Government Grabbing Lan

    Grabbing Lands : బీఆర్‌ఎస్ భూ అక్రమాలకు.. రేవంత్ సర్కార్ ప్రక్షాళన!

  • Telangana Global Summit

    Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. రెండు ఫుట్‌బాల్ అకాడమీలు ప్ర‌క‌టించే ఛాన్స్‌?!

  • Telangana Rising Summit

    Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

  • Telangana Rising Global Summit

    Telangana Rising Global Summit: తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు పీఎం మోదీ, రాహుల్ గాంధీ?!

Latest News

  • Yarlagadda VenkatRao : అరాచక పాలన అంతం, అభివృద్ధికి పట్టం – ఎమ్మెల్యే యార్లగడ్డ

  • PSU Banks : ప్రభుత్వ రంగ బ్యాంకుల పై కేంద్రం షాకింగ్ కుదేలైన అన్ని షేర్లు!

  • India Loses Toss: టీమిండియా ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

  • Trump Tariffs : 19 దేశాలపై మరిన్ని ఆంక్షలు విధించిన ట్రంప్

Trending News

    • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

    • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

    • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

    • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd