Minor Rape Case: ప్లాన్ ప్రకారమే రేప్.. రక్షణ కోసం కండోమ్స్ కూడా!
హైదరాబాద్ మైనర్ రేప్ కేసు చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే.
- By Balu J Updated On - 05:46 PM, Mon - 13 June 22

హైదరాబాద్ మైనర్ రేప్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయమవుతున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసుల విచారణలో విస్తుకొల్పే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితులు చెబుతున్న విషయాలకు పోలీసులే షాక్ అవుతున్నారు. మే 28న జూబ్లీహిల్స్‌లో మైనర్‌పై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు సమాచారం. ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం ముందస్తు ప్రణాళికతో జరిగిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. “నలుగురు మైనర్లు, యువకుడితో సహా ఐదుగురు నిందితులు ముందస్తు ప్రణాళిక ప్రకారం నేరానికి పాల్పడ్డారు. వాళ్ల దగ్గర కండోమ్‌లు కూడా ఉన్నాయి. అత్యాచార ఘటనకు పాల్పడే సమయంలో రక్షణను ఉపయోగించారు, ”అని ఒక పోలీసు అధికారి తెలిపారు, “వారికి కండోమ్‌లు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకోవడానికి మేం ప్రయత్నిస్తున్నాము.” పోలీస్ అధికారి తెలిపారు.
పోలీసులు నిందితులందరి కాల్ డేటా రికార్డులను (CDR) సేకరించారు. మరిన్ని విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులకు శనివారం లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి ఆదివారం పరీక్ష జరిగింది. రిపోర్ట్స్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లో జరిగిన క్రైమ్ సీన్‌ను కూడా పోలీసులు రీక్రియేట్ చేశారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) నాయకుడి కుమారుడు, సహా ఐదుగురు యువకులను జువైనల్ హోమ్ నుండి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు విచారణ కోసం తీసుకువచ్చారు.
Related News

Hyderabad To Leh: హైదరాబాద్ టు లద్దాక్.. సైకిల్ పై సాహసయాత్ర!
హైదరాబాద్లోని పటాన్చెరుకు చెందిన పదిహేడేళ్ల యువకుడు మాచర్ల వెంకటేష్ సాహసయాత్రకు శ్రీకారం చుట్టాడు.