Bandi Sanjay Flexis : బండి సంజయ్ పై కేసీఆర్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు.. ఫ్లెక్సీలు తొలగింపు..!
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Flexis) బాధ్యతలు స్వీకరించి నేడు హైదరాబాద్ విచ్చేస్తున్నారు.
- By Gopichand Published Date - 01:36 PM, Fri - 4 August 23

Bandi Sanjay Flexis : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Flexis) బాధ్యతలు స్వీకరించి నేడు హైదరాబాద్ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను, తోరణాలను పోలీసుల సహాయంతో తొలగిస్తున్న ప్రభుత్వం. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం? బీజేపీకి ఒక న్యాయమా? అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్న బీజేపీ కార్యకర్తలు. బీజేపీ ఫ్లెక్సీలను తొలగిస్తున్న పోలీసులు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను ఎందుకు తొలగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ శ్రేణులు.
Also Read: EVM Manipulation : 2019 ఎన్నికల్లో బీజేపీ కుట్ర: మెక్ క్రారి టెస్ట్ తేల్చివేత
ఫ్లెక్సీలను తొలిగిస్తుండటంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. పైనుండి ఆదేశాలొచ్చాయంటూ లకిడీకపూల్, నాంపల్లి, బంజారాహిల్స్ సహా నగరంలో బండి సంజయ్ కు స్వాగతం పలుకుతూ బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు అకారణంగా తొలగిస్తున్నారు. బండి సంజయ్ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడమేంటని ప్రశ్నిస్తున్న కార్యకర్తలకు.. పైనుండి ఆదేశాలంటూ పోలీసులు జవాబిస్తున్నారు. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగమేనంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.