Owaisi Vs Raja Singh : మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
- Author : Pasha
Date : 27-06-2024 - 2:10 IST
Published By : Hashtagu Telugu Desk
Owaisi Vs Raja Singh : మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఒక్క జూన్ నెలలోనే ఓల్డ్ సిటీలో పెద్దసంఖ్యలో మర్డర్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానం పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయని రాజాసింగ్ ఆరోపించారు. ‘‘మర్డర్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు.. అందులో నీకు బాధ ఏంటి అసద్ ? పోలీసులపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నావు ?’’ అని ఆయన ప్రశ్నించారు. అసదుద్దీన్ పార్టీ వాళ్లు తెస్తున్న ఒత్తిడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నాడని రాజాసింగ్(Owaisi Vs Raja Singh)పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ఓల్డ్ సిటీలోని బాలాపూర్, శాలిబండ, బేగంపేట, మల్లేపల్లి, అసిఫ్ నగర్, కాలా పత్తర్, కాచిగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో లూటీలు జరుగుతున్నాయి. మేడ్చల్‌లో తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ పక్కనే దోపిడీ, మర్డర్ జరిగింది. పోలీసుల భయం లేకపోవడం వల్లే మర్డర్లు, లూటీలు జరుగుతున్నాయి’’ అని ఆయన ఆరోపించారు. ‘‘ఓల్డ్ సిటీలో ఇలాంటివి జరగొద్దు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడొద్దు. పోలీసులు రేవంత్ రెడ్డి ఆదేశాలను ఫాలో చేయాలి.. కానీ అసద్ ఆదేశాలను ఫాలో కావొద్దు’’ అని రాజాసింగ్ సూచించారు. ‘‘ఓల్డ్ సిటీలో తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా దుకాణాలు, హోటళ్లు తెరిచే ఉంచుతున్నారు. వాటిని బంద్ చేయించేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు. కానీ వారిని ఎంఐఎం నేతలు బెదిరిస్తున్నారు. ఎంఐఎం నేతలకు పాతబస్తీ అడ్డాగా మారింది’’ అని ఆయన ఆరోపించారు.