Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. HMRL కీలక నిర్ణయం..
Hyderabad Metro :తొలి దఫా రద్దీగా ఉండే మార్గాలను లక్ష్యంగా తీసుకొని, అమీర్‌పేట్, రాయదుర్గ్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వంటి స్టేషన్లలో ప్రయాణికుల విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని, నాలుగు అదనపు కోచ్‌లను నాగ్‌పూర్, పుణే మెట్రో నుంచి లీజుకు తీసుకోనున్నట్లు సమాచారం.
- By Kavya Krishna Published Date - 10:54 AM, Tue - 7 January 25

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోలో రద్దీ సమస్యను పరిష్కరించడానికి హెచ్‌ఎంఆర్‌ఎల్ కొత్త బోగీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. గత ఏడాది నుండి అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని చెబుతూ కూడా, ఇప్పటివరకు ఆ చర్యలు కార్యరూపం దాల్చలేదు. కానీ ఈ నెలాఖరులోగా నగరంలో కొత్త బోగీలను తీసుకురావడానికి హెచ్‌ఎంఆర్‌ఎల్ చర్యలు ప్రారంభించింది. తొలి దఫా రద్దీగా ఉండే మార్గాలను లక్ష్యంగా తీసుకొని, అమీర్‌పేట్, రాయదుర్గ్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వంటి స్టేషన్లలో ప్రయాణికుల విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని, నాలుగు అదనపు కోచ్‌లను నాగ్‌పూర్, పుణే మెట్రో నుంచి లీజుకు తీసుకోనున్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా హైదరాబాద్ మెట్రోలో రోజువారీ ప్రయాణీకుల సంఖ్య ఐదున్నర లక్షలకు పైగా ఉంది. ముఖ్యంగా ఆఫీసు సమయాల్లో నాగోల్-రాయదుర్గ్ మార్గంలో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. స్టేషన్ల వద్ద ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతున్నా, మరొక రైలు వచ్చేంత వరకు వారికి సరిపడిన బోగీలు అందుబాటులో లేకపోవడంతో, ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై ఇబ్బందులతో ఎదురుచూస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏడాది నుంచి డిమాండ్లు పెరిగినప్పటికీ, మెట్రో లేదా ఎల్ అండ్ టీ సంస్థలు ఈ విషయంలో చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా, ప్రయాణికుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త బోగీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Allu Arjun: నేడు శ్రీతేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్?
ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి, గత ఏడాది జులైలోనే కొత్త బోగీలను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ భావించింది. కానీ ఎల్ అండ్ టీ ఆసక్తి చూపకపోవడంతో, బోగీలు పెంచే ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే, ఈ నెలాఖరులోగా 92 కోట్ల రూపాయలతో నాలుగు బోగీలను లీజుకు తీసుకుని, మెట్రోకు కొత్త కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.
ఇదిలా ఉంటే, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కొత్త మెట్రో రైల్వే లైన్ నిర్మాణం ప్రారంభించడానికి, భూములు కోల్పోయిన బాధితులకు 18.63 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన సందర్భంలో, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ చెప్పినట్లుగా, మెట్రో ప్రాజెక్టు ఫేజ్ 2 కింద 6వ కారిడార్‌ను 7.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించడానికి రూ.2,741 కోట్లతో పనులు చేపట్టబోతున్నారు. ఈ నిర్మాణం నాలుగేళ్లలో పూర్తి అవుతుందని చెప్పారు.
ఓల్డ్ సిటీలోని మెట్రో స్టేషన్లలో వాణిజ్య కార్యకలాపాలు చేయాలనుకునే బాధితులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే అర్హులైన స్థానికులకు ఉపాధి కల్పించాలని కూడా ఆయన సూచించారు. 81 వేలు చొప్పున భూసేకరణ పూచీకత్తులు ఇచ్చినట్లు తెలిపారు. 2024 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని, స్టేషన్లు సాలర్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, అలియాబాద్, ఫలక్‌నుమా వంటి ప్రదేశాలలో నిర్మించబడుతాయని వివరించారు.
Kamala Certified Trump : డొనాల్డ్ ట్రంప్ గెలుపును సర్టిఫై చేసిన కమల.. ఎందుకు ?