BRS విజన్ వల్లే ఈరోజు హైదరాబాద్ ముంపుకు గురికాలేదు – కేటీఆర్
గత మూడు రోజులుగా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొండపోత వర్షాలు పడుతున్నప్పటికీ..హైదరాబాద్ లోని చాల ప్రాంతాలు ముంపుకు గురి కాలేదంటే అందర్నీ ఆశ్చర్యానికి, అలాగే షాక్ కు గురి చేస్తున్నాయి
- By Sudheer Published Date - 06:58 PM, Mon - 2 September 24
హైదరాబాద్ (Hyderabad) లో 10 నిమిషాల పాటు గట్టి వర్షం పడితేనే రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. ఎక్కడిక్కడే నీరు నిలిచి వాహనదారులకు ఇబ్బందులకు గురి చేస్తాయి. అలాగే లోతట్టు ప్రాంతాలను సైతం ముంపుకు గురి చేస్తాయి. అలాంటిది గత మూడు రోజులుగా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొండపోత వర్షాలు పడుతున్నప్పటికీ..హైదరాబాద్ లోని చాల ప్రాంతాలు ముంపుకు గురి కాలేదంటే అందర్నీ ఆశ్చర్యానికి, అలాగే షాక్ కు గురి చేస్తున్నాయి. దీనికి కారణం గత ప్రభుత్వం నగరంలో చేపట్టిన SNDP (వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం ) అని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే విషయాన్నీ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియజేసారు.
We’re now on WhatsApp. Click to Join.
భారీ వర్షాలకు సైతం హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు ముంపునకు గురికాలేదనే వార్త వినేందుకు ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు. దీనికి కారణం SNDP అని ఆయన పేర్కొన్నారు. ‘BRS విజన్ను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఇంజినీర్ల బృందం, అన్ని విభాగాలు కలిసికట్టుగా శ్రమించాయి. మీ అంకితభావం వల్లే ఈరోజు హైదరాబాద్ మరింత మెరుగ్గా ఉంది. నాతో నిలబడి ఈ నగరాన్ని ప్రగతికి నమూనాగా మార్చినందుకు ధన్యవాదాలు’ అని KTR ట్వీట్ చేశారు. తెలంగాణకు ఎకనమిక్ ఇంజన్ అయిన హైదరాబాద్ లో భారీవర్షాల వల్ల వచ్చే వరద ముప్పును నివారించేందుకు గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్.ఎన్.డి.పి) చేపట్టామని స్పష్టంచేశారు.
సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యేవని, కాలనీల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరి పేద, మధ్యతరగతి ప్రజల జనజీవనం పూర్తిగా అస్తవ్యస్థంగా మారేదని గుర్తు చేశారు. ఈ కీలక సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఆలోచనలో భాగంగానే ఎస్.ఎన్.డి.పీ. పురుడుపోసుకుందని చెప్పారు. రాష్ట్ర రాజధానిలో వరదనీరు, మురుగునీటి వ్యవస్థను పూర్తిస్థాయిలో పటిష్టపరిచేందుకు 985 కోట్లతో 60 పనులు చేపట్టడం వల్లే ఈ రోజు వరద ముప్పు తప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సహకారం లేకున్నా.. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఎస్.ఎన్.డి.పి. పనులు చేపట్టడం మరో ప్రత్యేకత అని వెల్లడించారు.
So glad to hear that most of Hyderabad isn’t inundated after the heavy rains yesterday. SNDP(Strategic Nala Development Program) brought about transformative change in Hyderabad, with a clear purpose of systematic reorganization and accountability.
This achievement wouldn’t…
— KTR (@KTRBRS) September 2, 2024
Read Also : Venkaiah Naidu : తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు విరాళం
Related News
Minister Nimmala Efforts: బుడమేరు పూడికతీత పనుల్లో నిమ్మల పరితీరుపై చంద్రబాబు ప్రశంసలు
Minister Nimmala Efforts: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో అధికారులు యుద్ధప్రాదిపదికన పనులు చేపట్టారు. మంత్రి నిమ్మల చొరవని అభినందించారు సీఎం చంద్రబాబు. జిల్లాలో కొనసాగుతున్న సహాయక చర్యలపై చర్చించేందుకు మంత్రులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు.