Hyderabad Expansion: హైదరాబాద్ ‘మహా’ విస్తరణ.. ఎక్కడి వరకో తెలుసా ?
ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న హైదరాబాద్(Hyderabad Expansion) నగరాన్ని కోర్ అర్బన్ ప్రాంతంగా, ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న నగరాన్ని సెమీఅర్బన్ ప్రాంతంగా విభజిస్తారు.
- By Pasha Published Date - 07:52 AM, Wed - 5 March 25

Hyderabad Expansion: హైదరాబాద్ మహా నగరం.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణం. కాస్మోపాలిటన్ కల్చర్ కలిగిన నగరంగా భాగ్యనగరం దేశంలోనే ఫేమస్. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ హబ్ కూడా. మన హైదరాబాద్ నగరాన్ని మరింతగా విస్తరించనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ – హెచ్‌ఎండీఏ) పరిధిని మరింత పెంచనున్నారు. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Mayuri Kango : ఒకప్పుడు నటిగా ఫెయిల్… ఇప్పుడు గూగుల్ ఇండియా మేనేజర్
హైదరాబాద్ మహానగరం విస్తరణ ప్రణాళికలు
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) ఉండేది. అప్పట్లో హెచ్‌ఎండీఏ లేదు. ఆనాడు హైదరాబాద్ నగరం విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లే.
- 2008 సంవత్సరంలో ‘హుడా’ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)ని ఏర్పాటు చేశారు. తదుపరిగా హెచ్‌ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది.
- ప్రస్తుతం తెలంగాణలోని 7 జిల్లాల్లో హెచ్‌ఎండీఏ విస్తరించి ఉంది.
- 70 మండలాలు, 1,000 గ్రామ పంచాయతీలు, 8 కార్పొరేషన్‌లు, 38కిపైగా మున్సిపాలిటీలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి.
- కొత్తగా రీజియనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) వరకు హైదరాబాద్ మహానగరం పరిధిని పెంచేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు రెడీ అయింది. దీంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు కొత్తగా హెచ్‌ఎండీఏ పరిధిలోకి చేరుతాయి.
- దీంతో హెచ్‌ఎండీఏ పరిపాలనలోకి 11 జిల్లాలు, 106 మండలాలు, 1,400కుపైగా గ్రామాలు వస్తాయి.
- హెచ్ఎండీఏ పరిధిలోని భూ విస్తీర్ణం 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చదరపు కిలోమీటర్లకు పెరగనుందని అంచనా.
- ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్‌కు వెలుపల మరో 5 కిలోమీటర్ల దాకా హెచ్‌ఎండీఏ పరిధి పెరుగుతుందని అంటున్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు, ప్రజా రవాణా సదుపాయాలు, మౌలిక సదుపాయాల విస్తరణకు ఇప్పటికే లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యయనం చేశారు.
- ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న హైదరాబాద్(Hyderabad Expansion) నగరాన్ని కోర్ అర్బన్ ప్రాంతంగా, ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న నగరాన్ని సెమీఅర్బన్ ప్రాంతంగా విభజిస్తారు. మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు.
- హైదరాబాద్ మహా నగరం పరిధిలోని సెమీఅర్బన్ ప్రాంతం వరకు సమగ్రమైన మాస్టర్‌ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు.
- ఈమేరకు హైదరాబాద్ మహా నగరం విస్తరణకు సంబంధించిన ప్రణాళికను త్వరలో జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించే ఛాన్స్ ఉంది. ఆ వెంటనే జీవో విడుదల చేస్తారని తెలుస్తోంది.