HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Huge Conductor Job Vacancies In Tgsrtc Ready For Recruitment

TGSRTCలో భారీగా కండక్టర్ ఉద్యోగ ఖాళీలు…నియామకాలకు రెడీ

  • By Vamsi Chowdary Korata Published Date - 10:05 AM, Tue - 25 November 25
  • daily-hunt
Tgsrtc
Tgsrtc

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దశాబ్ద కాలంగా నియామకాలు లేకపోవడంతో 2,059 మంది కండక్టర్ల కొరత ఏర్పడింది. కొత్త బస్సులొచ్చినా.. డ్రైవర్లపైనే కండక్టర్ల బాధ్యతలు, డబుల్ డ్యూటీలతో ఒత్తిడి పెరుగుతోంది. మొత్తం ఉద్యోగుల సంఖ్య కూడా 11 ఏళ్లలో 18,025 తగ్గింది. తక్షణమే 1500 కండక్టర్ల నియామకానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోరుతోంది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో సిబ్బంది కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా కండక్టర్ల పోస్టుల్లో ఈ సమస్య అత్యధికంగా ఉండటంతో సంస్థ కార్యకలాపాలు నిర్వహించడానికి తాత్కాలిక సర్దుబాట్లపై ఆధారపడాల్సి వస్తుంది. కండక్టర్ల నియామకం జరిగి దాదాపు దశాబ్దం దాటడంతో.. ఈ సమస్య ఏటా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2,059 మంది కండక్టర్ల కొరత ఉంది. మార్చి 2026 లోపు మరో 140 మంది ఉద్యోగ విరమణ చేయనున్నారు.

ఇటీవల కాలంలో కొత్తగా 388 బస్సులను TGSRTC రోడ్డెక్కించింది. వీటి నిర్వహణ కోసం అదనంగా 1,009 మంది కండక్టర్లు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ లెక్కల ప్రకారం.. ఆర్టీకికి తక్షణమే 3,208 మంది కండక్టర్లు అవసరం. ఈ నేపథ్యంలో, తక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కనీసం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం కొద్దిరోజుల క్రితం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లింది. కండక్టర్ల కొరత తీవ్రంగా ఉండటంతో.. ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలికంగా సర్దుబాట్లను అమలు చేస్తోంది.

దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో డ్రైవర్లకే కండక్టర్ల బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. దీనివల్ల డ్రైవర్లపై పని భారం పెరిగి, భద్రత విషయంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న కండక్టర్లకు వీలున్నంత వరకు డబుల్ డ్యూటీలు వేస్తున్నారు. ఇది సిబ్బందిపై ఒత్తిడిని పెంచుతోంది. కొద్దిమంది సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తీసుకుని నెట్టుకొస్తున్నారు. ఆర్టీసీలో సిబ్బంది కొరత కేవలం కండక్టర్ల పోస్టులకే పరిమితం కాలేదు. గత దశాబ్దంలో ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.

2014-15లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 56,740 కాగా.. ప్రస్తుతం (2025) మొత్తం ఉద్యోగుల సంఖ్య 38,715. 11 ఏళ్లలో దాదాపు 18,025 మంది ఉద్యోగులు తగ్గారు. గతంలో పోలిస్తే బస్సుల సంఖ్య తగ్గినప్పటికీ ఉద్యోగుల నిష్పత్తిలో వచ్చిన భారీ మార్పు సంస్థ నిర్వహణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయితే.. తాజాగా కొత్త బస్సుల రాకతో 2025 అక్టోబరు నాటికి బస్సుల సంఖ్య మళ్లీ పెరిగింది. ప్రభుత్వం నుంచి తక్షణమే అనుమతి వస్తే.. కండక్టర్ల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్టీసీ యాజమాన్యం ఎదురుచూస్తోంది. దీనికి ముందు 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. పోలీస్ నియామక మండలి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #CMRevanthReddy
  • Conductor
  • telangana government
  • TGSRTC

Related News

TGSRTC's massive plan...a new impetus to transportation facilities across the state

TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ భారీ ప్రణాళిక..రాష్ట్రవ్యాప్తంగా రవాణా వసతులకు కొత్త ఊపు

ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 97 బస్ డిపోలతో పాటు మరిన్ని ప్రాంతాల్లో రవాణా అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ రెండు కొత్త డిపోల నిర్మాణాన్ని చేపట్టింది.

  • Ktr

    BRS Alleges : 9300 ఎకరాల కుంభకోణంలో రేవంత్‌..కేటీఆర్‌ షాకింగ్!

Latest News

  • Guwahati Test : గువాహటి టెస్టుపై అశ్విన్ పోస్ట్.. పంతూ ఏంది సామీ నీ బాడీ లాంగ్వేజ్!

  • CBN : మెరుగైన పాలన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

  • Smriti Mandhana : స్మృతి మంధాన పెళ్లి జరిగేనా..? పోస్టులు డిలీట్ చేయడానికి కారణం ఏంటి..?

  • Srikakulam : ఉత్తరాంధ్రను వణికిస్తున్న కొత్త వ్యాధి?

  • Bengaluru : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వీక్నెస్ ను క్యాష్ చేసుకున్న ఆయుర్వేద వైద్యుడు

Trending News

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

    • Karun Nair: కరుణ్ నాయర్ కీల‌క వ్యాఖ్యలు.. టీమిండియా పైనేనా?

    • Skanda Shashthi 2025: స్కంద షష్ఠి వ్రతం గురించి మీకు తెలుసా? ముహూర్తం, పూజా విధానం ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd