HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Huge Competition For The New Telangana Pcc Executive Committee

TPCC : టీపీసీసీ కార్యవర్గానికి ఎంపికయ్యేది ఎవరు ? క్లారిటీ అప్పుడే !

కాంగ్రెస్ పార్టీ(TPCC) గ్రామ, మండల, జిల్లాల అధ్యక్షుల ఎంపికను ఈ నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశం ఉంది.

  • Author : Pasha Date : 10-05-2025 - 1:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Tpcc Executive Committee Congress Telangana Cabinet

TPCC : తెలంగాణ పీసీసీ రాష్ట్ర కార్యవర్గం పదవులకు భారీ పోటీ నెలకొంది. ఆశావహ నేతలు పెద్దసంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు.  మరో మూడు నుంచి నాలుగురోజుల్లోగా వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల ఎంపికను పూర్తి చేసేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది.  ఆయా పదవులకు అర్హులైన వారి పేర్లను రేపో, మాపో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ (ఏఐసీసీ)కి పంపనున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్ష పదవుల కోసం అప్లై చేసిన వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. దీంతో పోటీ ఏ రేంజులో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 2017 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికే  పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపికలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

ఆచితూచి లిస్ట్ తయారీ

టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మమహేశ్‌కుమార్‌గౌడ్‌  ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చారు. కొత్త పీసీసీ కార్యవర్గం పదవుల కోసం దాదాపు రెండు వందల మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సారి లిమిటెడ్‌గా జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ కోసం సిన్సీయర్ గా పని చేసే వారికి అవకాశం కల్పించనున్నారట. టీపీసీసీ సెక్రటరీలు, అధికార ప్రతినిధుల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి లిస్ట్ తయారు చేస్తున్నట్లు సమాచారం.

Also Read : Srinagar Explosions: శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు‌పై పాక్ దాడి.. దాల్‌ లేక్‌లో మిస్సైల్ పేలుడు

వర్కింగ్‌ ప్రెసిడెంట్ పోస్టులు.. ఏ వర్గానికి ? 

గత టీపీసీసీ కార్యవర్గంలో ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఈసారి కూడా నలుగురు లేదా ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, 20 మందిని ప్రధాన కార్యదర్శులుగా, 25 మందిని ఉపాధ్యక్షులుగా నియమించే ఛాన్స్ ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఉన్నందున.. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా అదే వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవులకు ఒక ఓసీ ఎంపీ, బీసీ మహిళ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం.

Also Read :Operation Sindoor Movie : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పోస్టర్.. సారీ చెప్పిన దర్శకుడు.. ఎందుకు ?

గ్రామ, మండల, జిల్లాల అధ్యక్షుల ఎంపిక విషయంలో.. 

కాంగ్రెస్ పార్టీ(TPCC) గ్రామ, మండల, జిల్లాల అధ్యక్షుల ఎంపికను ఈ నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఒక్కో అధ్యక్ష పదవికి ఐదుగురు నేతల పేర్లను క్షేత్రస్థాయి నేతలు సూచించనున్నారు.  అయితే ఒకే సామాజిక వర్గం నుంచి రెండు పేర్లను అస్సలు పంపొద్దని నిర్దేశించారు. గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ముఖ్య కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించి గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఐదుగురి పేర్లను ప్రతిపాదించనున్నారు. వీరిలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి ఒక్కో పేరు ఉంటుంది. మండల, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవులకూ ఇదే విధానంలో పేర్లు పంపనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • congress
  • telangana
  • telangana cabinet
  • telangana congress
  • tpcc
  • TPCC Chief
  • TPCC Executive Committee

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd