HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Huge Amount Of Cash Seized In Hyderabad

HYD : హైదరాబాద్​లో అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత

మంగళవారం నాడు హైదరాబాద్​లోని దారుస్సలాం ఔట్​పోస్ట్‌ వద్ద భారీగా నగదు పట్టుబడింది.

  • Author : Sudheer Date : 03-04-2024 - 11:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Kisan Maandhan Yojana
Money Vastu

ఎన్నికల వేళ (Election Code)..హైదరాబాద్ లో భారీగా నగదు లభ్యమైంది. దేశ వ్యాప్తంగా లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతుంటాయి కాబట్టి…ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టింది. నగదు రవాణాను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే చెక్​పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా హైదరాబాద్​లో అక్రమంగా తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నాడు హైదరాబాద్​లోని దారుస్సలాం ఔట్​పోస్ట్‌ వద్ద భారీగా నగదు పట్టుబడింది.

We’re now on WhatsApp. Click to Join.

మంగళ్​హాట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొత్త రవిచంద్ర, సురేశ్, శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లా ములుకలపల్లి చెక్ పోస్ట్ వద్ద వేర్వేరు సోదాల్లో రూ. 8 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నుంచి మహబూబాబాద్ వైపు వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా ఓ రూ.4.50 లక్షల నగదు పట్టుబడగా, మరో వాహనంలో రూ.3.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేట వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.6.40 లక్షలు పట్టుబడ్డాయి.

ఏపీలోనూ పెద్ద ఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈసారి ఏపీలో ఎన్నికలు గట్టిగా ఉండబోతుండడం తో పెద్ద ఎత్తున నగదు చేతులు మారే అవకాశం ఉండడం తో పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దించింది. అనేక చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.

Read Also : Vistara : విస్తారాలో సంక్షోభం.. 15 మంది సీనియర్ పైలట్ల రాజీనామా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • election code
  • hyderabad
  • money seized

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

  • Massive blast in Hyderabad's Saroornagar.

    Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd