Caste Census Survey : తెలంగాణ లో మొత్తం ఎన్ని కులాలు ఉన్నాయంటే..!!
Caste Census Survey : కులగణన కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రక్రియలో, కులాలకు ప్రత్యేకంగా కోడ్లను కేటాయించారు
- Author : Sudheer
Date : 10-11-2024 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 243 రకాల కులాలున్నట్లు (castes ) ప్రభుత్వం ప్రకటించింది. ఈ కులాలలో బీసీల్లో 134, ఎస్సీల్లో 59, ఎస్టీల్లో 32, ఓసీల్లో 18 సామాజిక వర్గాలు ఉన్నాయని వెల్లడించింది. కులగణన కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రక్రియలో, కులాలకు ప్రత్యేకంగా కోడ్లను కేటాయించారు. కులం మరియు మతం లేకపోయిన వారికి కూడా ఓ కోడ్ని కేటాయించారు. ఇతర రాష్ట్రాల ప్రజల నుండి ప్రత్యేకంగా కోడ్లతో డేటా సేకరణ చేయబడుతుంది. అలాగే, భూసమస్యలపై కూడా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే (Caste Census Survey) చేస్తున్నారు. మూడు రోజుల పాటు ప్రతి ఇంటికి స్టికర్ వేసిన అధికారులు..నిన్నటి నుండి సర్వే చేయడం స్టార్ట్ చేసారు. ఈ సర్వేలో 75 ప్రశ్నలను అడుగుతున్నారు. సర్వేలో భాగంగా కుటుంబ ఫొటోలు ఏమీ తీయరు. ఎలాంటి పత్రాలు తీసుకోరు. ఇంట్లో అందరూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబ యజమాని వివరాలు చెబితే సరిపోతుంది. కుటుంబీకుల్లో ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తే ఆ వివరాలు నమోదు చేస్తారు. ప్రజాప్రతినిధులు వారి ప్రస్తుత, పూర్వపు పదవీ వివరాలు చెప్పాలి. సమాచారం గోప్యంగా ఉంచుతారు.
కులగణన సర్వే సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ధరణి పట్టా పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో సర్వే త్వరితగతిన పూర్తి చేయడానికి ఉపయోగ పడుతుంది. ఈ నెల 21 వరకు అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు.
Read Also : Delhi Ganesh : ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్ మృతి