HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Highlights Of The Second Day Of The Summit

Telangana Global Summit 2025 : సమ్మిట్ రెండో రోజు హైలైట్స్

Telangana Global Summit 2025 : హైదరాబాద్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేడుకలు రెండో రోజు (మంగళవారం) అత్యంత ఉత్సాహంగా కొనసాగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర భవిష్యత్తును రూపుదిద్దే "తెలంగాణ రైజింగ్-2047" విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు

  • Author : Sudheer Date : 10-12-2025 - 8:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Global Summit 2025 Day 1
Global Summit 2025 Day 1

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేడుకలు రెండో రోజు (మంగళవారం) అత్యంత ఉత్సాహంగా కొనసాగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర భవిష్యత్తును రూపుదిద్దే “తెలంగాణ రైజింగ్-2047” విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. ఈ కీలక కార్యక్రమంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, కాలిఫోర్నియా ఎకనమిక్ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినీ నటుడు చిరంజీవి సహా పలువురు మంత్రులు, దేశ విదేశాల ప్రముఖులు, వాణిజ్యవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమ్మిట్ ప్రారంభమైన తొలిరోజే రాష్ట్రానికి ఏకంగా 2 లక్షల 43 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం, 35 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ఈ వేడుకల విజయానికి నిదర్శనం. రెండో రోజు కూడా సీఎం సుమారు 20 సమావేశాల్లో పాల్గొని, ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మరియు AI రంగాల కంపెనీలతో పెట్టుబడులపై చర్చించడం విశేషం.

India vs South Africa: టీమిండియా సంచలన విజయం.. దక్షిణాఫ్రికాపై 101 పరుగుల తేడాతో గెలుపు!

సమ్మిట్‌లో పారిశ్రామిక ఒప్పందాలు మరియు చర్చలతో పాటు, వివిధ అంశాలపై ప్యానల్ డిస్కషన్స్ ఆకర్షణీయంగా జరిగాయి. ‘ఒలంపిక్ గోల్డ్ క్విస్ట్’ అనే అంశంపై జరిగిన చర్చలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పాల్గొని, తెలంగాణలో కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేశారు. క్రీడారంగానికి సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే విధంగా పెద్దపీట వేస్తున్నారని క్రికెటర్ అంబటి రాయుడు ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, సీఎంతో తాజ్ జీవీకే, సుమధుర గ్రూప్, ప్రెస్టీజ్ గ్రూప్, టీసీసీఐ, సెంబ్ కార్ప్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు భేటీ అయి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈ సాయంత్రం ముగింపు వేడుకలో భాగంగా, గిన్నిస్ రికార్డు లక్ష్యంగా డ్రోన్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. అంతేకాకుండా, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్‌గా ఆవిష్కరించారు.

‎Apply Oil: ప్రతిరోజు జుట్టుకు నూనె రాయకూడదా.. ఎన్ని రోజులకు ఒకసారి అప్లై చేయాలో తెలుసా?

ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణలో పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి మరియు క్రీడాభివృద్ధికి బలమైన పునాది వేసింది. నేడు (బుధవారం) చివరి రోజు ముగింపు వేడుక ‘తెలంగాణ రైజింగ్ కమ్-జాయిన్‌ది రైస్’ థీమ్‌తో ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నేడు సాయంత్రం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశమై గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్‌ప్రైజెస్ రంగాల పెట్టుబడులపై చర్చిస్తారు. కాగా, మంత్రి కొండా సురేఖ ఇందిరమ్మ చీర కట్టుకొని సమ్మిట్‌కు హాజరై, అటవీ-పర్యావరణం, దేవాదాయశాఖపై బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ సమ్మిట్ స్ఫూర్తితో, హైదరాబాద్ మరో గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్‌కు (జనవరి 4, 5, 6 తేదీల్లో) ఆప్టా ఆధ్వర్యంలో వేదిక కానుంది. ఈ మెగా ఈవెంట్ ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్య రంగానికి కొత్త ఊపు రానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business celebrities
  • cm revanth
  • guests coming
  • hyderabad
  • Sports celebrities
  • Telangana Global Summit 2025
  • Telangana Global Summit highlights
  • Telangana Rising-2047
  • tollywood celebrities

Related News

Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

ఒక ఉబెర్ డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో, ఒకప్పుడు అమెజాన్‌లో ఉద్యోగిగా పనిచేసిన ఆ డ్రైవర్, డ్రైవింగ్ పట్ల తనకున్న అభిరుచిని కొనసాగించడానికి ఉద్యోగాన్ని వదిలేశాడని వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యక్తి, తన నగరాన్ని అన్వేషిస్తూనే వివిధ నగరాల ప్రజలను కలుసుకునేందుకు వీలు కల్పించే ఉబెర్‌లో చేరాడు. ఉద్యోగి అమెజాన్‌ను వదిలి ఉబెర్

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

    Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd