Telangana Rice : తెలంగాణ బియ్యమా మజాకా.. క్యూ కడుతున్న రాష్ట్రాలు, దేశాలు!
దీన్నిబట్టి తెలంగాణ బియ్యం(Telangana Rice) క్వాలిటీపై ఆ రాష్ట్రాలకు ఎంతగా నమ్మకం కుదిరిందో మనం అర్థం చేసుకోవచ్చు.
- By Pasha Published Date - 08:44 AM, Mon - 16 December 24

Telangana Rice : తెలంగాణ బియ్యమా.. మజాకా. మన రాష్ట్రంలో పండే బియ్యం చాలా క్వాలిటీతో ఉంటుంది. అందుకే దీన్ని కొనేందుకు మన దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటు విదేశాలు కూడా క్యూ కడుతున్నాయి. దేశవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సప్లై చేసే బియ్యంలో ఎక్కువ భాగాన్ని పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) సేకరిస్తుంటుంది. దేశంలోని 11 రాష్ట్రాలు తమ రేషన్ షాపులకు తెలంగాణ బియ్యాన్ని సప్లై చేయాలని ఇటీవలే ఎఫ్‌సీఐను కోరాయట. దీన్నిబట్టి తెలంగాణ బియ్యం(Telangana Rice) క్వాలిటీపై ఆ రాష్ట్రాలకు ఎంతగా నమ్మకం కుదిరిందో మనం అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తూ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన ప్రజెంటేషన్‌లో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ ఈవిషయాన్ని తెలిపారు.
Also Read :Allu Arjuns Uncle : బీఆర్ఎస్ లేదా బీజేపీ.. అల్లు అర్జున్ మామ పార్టీ మారబోతున్నారా ?
తెలంగాణ బియ్యమే కావాలని అడుగుతున్న రాష్ట్రాల లిస్టులో పశ్చిమబెంగాల్, బిహార్, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయట. ఫిలిప్పీన్స్ దేశం కూడా తెలంగాణలో పండే ‘ఎంటీయూ 1010’ దొడ్డు రకం బియ్యాన్ని కోరుకుంటోంది. దీనిపై తెలంగాణ పౌర సరఫరాల శాఖతో త్వరలోనే ఫిలిప్పీన్స్ సర్కారు అగ్రిమెంటు చేసుకుంటుందని తెలిసింది. తొలి విడతలో లక్ష టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందట. తదుపరి విడతలో దాదాపు 9 లక్షల టన్నుల బియ్యానికి ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఆర్డర్‌లో కొంత భాగాన్ని ధాన్యం రూపంలో, ఇంకొంత భాగాన్ని బియ్యం రూపంలో తీసుకోనుంది.
Also Read :Bitcoin Record High : మరోసారి బిట్‌కాయిన్ రికార్డు ధర.. రూ.89 లక్షలకు చేరిక
రాష్ట్రంలోని రైతుల నుంచి ధాన్యం సేకరణకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ బ్యాంకుల నుంచి ఏటా వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తోంది. పౌర సరఫరాల శాఖ అందించే వడ్లను బియ్యంగా మార్చి ఇవ్వాల్సిన బాధ్యత రైస్ మిల్లర్లపై ఉంటుంది. అయితే కొందరు మిల్లర్లు వడ్లను తీసుకొని.. వాటిని బియ్యంగా మార్చి ఇవ్వడానికి దాదాపు రెండేళ్ల టైం తీసుకుంటున్నారు. ఈ జాప్యం వల్ల తాము తెచ్చుకున్న అప్పులపై బ్యాంకులకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ వందల కోట్ల రూపాయల వడ్డీని కట్టాల్సి వస్తోంది. బియ్యాన్ని ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తే అదనపు వడ్డీల భారం ఉండదని అంటున్నారు.