High Court Orders : చీకోటి ప్రవీణ్ కు భద్రత కల్పించండి…!!
క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కు భద్రత కల్పించే విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలంటూ తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ పోలీసులకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
- Author : hashtagu
Date : 11-08-2022 - 7:56 IST
Published By : Hashtagu Telugu Desk
క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కు భద్రత కల్పించే విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలంటూ తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ పోలీసులకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ లావాదేవీల వ్యవహారంలో ఇప్పటికే చీకోటి ప్రవీణ్ను EDవిచారించిన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా పలువురు రాజకీయ నేతల పేర్లను EDఅధికారులకు వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయని…ఈక్రమంలోనే తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ తనకు భద్రత కల్పించాలని పోలీసులు ఆదేశించాలని కోరుతూ ప్రవీణ్ ఈనెల 4న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనతోపాటుగా తన కుటుంబానికి కూడా భద్రత కల్పించాలని పిటిషన్ లో కోర్టును అభ్యర్థించారు ప్రవీణ్. ఈ పిటీషన్ పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రవీణ్ విజ్ఞప్తిని వారంలోగా పరిగణలోకి తీసుకోవాలని హైదారాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.