HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Heavy Rain In Medak Kamareddy

Heavy Rain : కామారెడ్డి, మెదక్ జిల్లాలను ముంచెత్తిన వాన

Heavy Rain : ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కేవలం 12 గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో 400 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం పరిస్థితుల తీవ్రతను సూచిస్తోంది. కామారెడ్డిలోని జీఆర్ కాలనీ వరద నీటిలో

  • Author : Sudheer Date : 28-08-2025 - 10:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kamareddy Medak Sangarededy
Kamareddy Medak Sangarededy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కేవలం 12 గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో 400 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం పరిస్థితుల తీవ్రతను సూచిస్తోంది. కామారెడ్డిలోని జీఆర్ కాలనీ వరద నీటిలో మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా భిక్నూర్ టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి 44 బ్లాక్ అవ్వడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడం వల్ల రైలు రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి.

Tragedy : కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. 14 మంది మృతి

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారి కుంగిపోవడంతో ప్రయాణాలు పూర్తిగా ఆగిపోయాయి. నిజాంసాగర్ మండలం లక్ష్మాపూర్ సమీపంలోని వాగులో 10 మంది కూలీలు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారు సమీపంలోని నీటి ట్యాంక్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినా, వాగులో ఉధృత ప్రవాహం కారణంగా రక్షాకార్యక్రమాలు కష్టతరంగా మారాయి.

పరిస్థితి మరింత దిగజారకుండా కేంద్రం, రాష్ట్రం కలిసి చర్యలు చేపడుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా కలెక్టర్, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులతో సమన్వయం చేస్తూ బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. మరోవైపు భారీ వర్షాల ప్రభావంతో అప్పర్ మానేరు డ్యామ్ నీటితో నిండిపోవడంతో వరద ప్రవాహం పెరిగింది. పరిసర ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను వేగవంతం చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heavy Rain
  • kamareddy
  • medak

Related News

Telangana Weather Report,

Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక

ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) కాస్త ఉపశమనం కలిగించే కబురు చెప్పింది. రాబోయే రెండు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్

  • AICC issues show-cause notice to Shabbir Ali.

    Shabbir Ali: షబ్బీర్‌అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

Latest News

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

  • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • Meta : ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd