HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Heavy Rain Brings Hyderabad To A Standstill

Heavy Rain: హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం

ఈ వ‌ర్షంతో హైద‌రాబాద్‌లోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య్యాయి. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, చైత‌న్య‌పురి, సికింద్రాబాద్‌, మాదాపూర్‌, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో వ‌ర్షం గంట‌పాటు దంచికొట్టింది.

  • Author : Gopi Date : 18-05-2024 - 5:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy Rain
Heavy Rain

Heavy Rain: తెలంగాణ‌లో భారీగా వర్షం (Heavy Rain) కురుస్తోంది. ఉదయం నుంచి వాతావరణ మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వాన మొదలైంది. ఈ వ‌ర్షంతో హైద‌రాబాద్‌లోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య్యాయి. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, చైత‌న్య‌పురి, సికింద్రాబాద్‌, మాదాపూర్‌, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో వ‌ర్షం గంట‌పాటు దంచికొట్టింది. దీంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వ‌ర్షం మొద‌లుకావ‌టంతోనే హైద‌రాబాద్‌లోని ఉద్యోగులు బ‌స్సుల‌ను కాకుండా మెట్రో రైళ్ల‌ను ఆశ్ర‌యించారు. దీంతో మెట్రోలో విప‌రీత‌మైన ర‌ద్దీ నెల‌కొంది. వీకెండ్ కావ‌టంతో స‌ర‌దాగా గ‌డుపుదామ‌ని వ‌చ్చిన ఐటీ ఉద్యోగులకు వ‌ర్షం తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది.

వర్షం కారణంగా ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ జామ్‌లతో ప్రయాణికులు ఇబ్బందులు ప‌డుతున్నారు. చాలా కూడ‌లిలో రోడ్లు, లేన్‌లు జలమయం కావడంతో ట్రాఫిక్ సజావుగా సాగడంలేదు. నగరంలోని చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజల కష్టాలను ఉపయోగించుకుని క్యాబ్ అగ్రిగేటర్లు ఛార్జీలను భారీగా పెంచారు. మెట్రో రైళ్ల‌కు ప్ర‌యాణికుల ర‌ద్దీ ఏర్ప‌డింది.

Also Read: Free Bus Scheme: ఉచిత బస్సు పథకాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం

అయితే హైదరాబాద్‌లో మ‌రో మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. గురువారం కూడా హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురిసిన విష‌యం తెలిసిందే. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ అల్ప‌పీడ‌నం ప్రభావంతో మే 23 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అల్పపీడనం మే 24 నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంద‌ని, దీంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని వివ‌రించింది.

We’re now on WhatsApp : Click to Join

అయితే.. గురువారం మధ్యాహ్నం రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షం హైదరాబాద్‌ను స్తంభింపజేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) ప్రకారం నల్గొండ జిల్లాలో 102.8, నాగర్‌కర్నూల్‌లో 101, హైదరాబాద్‌లోని ఖైర‌తాబాద్‌లో 90.3, షేక్‌పేటలో 87.5, అంబర్‌పేట్‌లో 85.3, నాంపల్లిలో 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heavy Rain
  • heavy rains
  • hyd rains
  • IMD
  • rains
  • Rains In Hyd
  • rains in telangana

Related News

IMD Alert

Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎమ్‌డీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ శనివారం వరకు అమల్లో ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసర

  • Southwest monsoon spreading across Telangana.

    IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telangana Weather Report,

    Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd