HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Raos Letter To Cm Revanth Demand To Reduce Tet Fees

Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ.. టెట్ ఫీజులు తగ్గించాలని డిమాండ్

  • Author : Balu J Date : 01-04-2024 - 5:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను రాశాను. టెట్, ఫీజులు, నిరుద్యోగ సమస్యలపై ప్రస్తావించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం టెట్‌ ఫీజులను భారీగా పెంచడంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమే. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ హరీశ్ రావు అన్నారు.

‘‘బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, టెట్ ఒక పేపర్‌ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకోగా, ఈ ఏడాది ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు సీబీఎస్‌ఈ నిర్వహించే సీటెట్‌తో పోల్చితే డబుల్ గా ఉండటం గమనార్హం. రిజర్వుడ్‌ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్‌ క్యాటగిరీ విద్యార్థులతో సమానంగా ఒకే తరహా ఫీజులను అమలు చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సీటెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్‌ఈ ఫీజు రాయితీని అమలు చేస్తున్నది. మన రాష్ట్రంలో ఎపిసెట్‌, ఐసెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లోనూ ఫీజుల రాయితీని అమలు చేస్తున్నారు. కానీ టెట్‌లో మాత్రం తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు’’ అని హరీశ్ రావు మండిపడ్డారు.

‘‘టెట్ ఫీజుల పెంపు, రిజర్వుడ్‌ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించక పోవడాన్ని నిరసిస్తూ బీఈడీ, డీఎడ్‌ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పోరాడుతున్నారు. పుస్తకాలు వదిలి రోడ్డకెక్కి ఉద్యమిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన. నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. వెంటనే టెట్‌ ఫీజులు తగ్గించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం’’ హరీశ్ రావు లేఖలో డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • CM Revanth Reddy
  • harish rao
  • TET Fee Hike

Related News

Mallareddy says goodbye to BRS

Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలి సమాధానాలు, విలక్షణమైన ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి.. త్వరలోనే బిఆర్ఎస్ (BRS) పార్టీని వీడనున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గత కొన్ని వారాలుగా ఆయన పార్టీ అధిష్ఠానానికి, ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో జరుగుతు

  • Election Commission deals a blow to Kavitha's party; 'Telangana Rakshana Sena' name must be changed.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

  • High drama at Telangana Bhavan; former minister Harish Rao taken into police custody.

    Harish Rao: తెలంగాణభవన్‌ వద్ద హైడ్రామా.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి హరీష్‌ రావు

  • Good news for farmers from the Revanth government.

    CM Revanth Reddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd