Harish Rao : హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు
Harish Rao : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
- Author : Kavya Krishna
Date : 09-09-2025 - 2:25 IST
Published By : Hashtagu Telugu Desk
Harish Rao : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. పరీక్షల కేంద్రాల కేటాయింపు, హాల్‌టికెట్ల జారీ, ఫలితాల ప్రకటనలో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని, ఈ కారణంగానే హైకోర్టు ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు కొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు మాట్లాడుతూ, “లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? హడావుడిగా పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది నీ నిరాక్ష్య పాలన ఫలితం” అని ఆరోపించారు.
BRS : సీఎం రేవంత్‌కు మతి భ్రమించిందా?..బీఆర్ఎస్ నేత పుట్ట మధు తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు మరింతగా మండిపడ్డారు. “గప్పాలు కొట్టడమే తప్ప, పరీక్షలు ఎలా నిర్వహించాలో కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు. నీ నిర్లక్ష్య వైఖరితో నిరుద్యోగులు బలవుతున్నారు” అని విమర్శించారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు నేరుగా సవాల్ విసిరారు. “ఇప్పటికైనా కండ్లు తెరువు. నీ మోసపూరిత పాలనకు, నిర్లక్ష్యానికి సిగ్గుతో తలదించుకో. తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పు” అని డిమాండ్ చేశారు.
Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా