HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Rao Revanth Reddy Power Cut Dispute

TS : హరీశ్‌ రావు-రేవంత్‌ రెడ్డిల విద్యుత్‌ కోతల వివాదం

  • Author : Latha Suma Date : 16-05-2024 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao-Revanth Reddy power cut dispute
Harish Rao-Revanth Reddy power cut dispute

Power cuts controversy:మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు(Harish Rao) గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్‌ కోతల(Power cuts) విషయంతో మరోసారి సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) పై విమర్శలు గుప్పించారు. అందరూ తనలాగే కుట్రలు, కుతంత్రాలు పన్నుతారనే భ్రమల్లోనే రేవంత్‌ రెడ్డి ఉన్నారని కానీ అలాంటి ఆలోచనలు మానుకొని ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించాలని అన్నారు. విద్యుత్ కోతల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులపై, తనపై ముఖ్యమంత్రి రెడ్డి చేసిన ఆరోపణల మీద తీవ్రంగా స్పందించారు. విద్యుత్ ఉద్యోగులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కరెంట్ కోతల విషయంలో ముఖ్యమంత్రి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు వేయడం విడ్డూరమన్నారు. విద్యుత్ రంగ వైఫల్యాలపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఆడరాక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాక ఇరవై నాలుగు గంటలూ నిరంతర విద్యుత్ అందించేందుకు… బీఆర్ఎస్ హయాంలోనే ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించినట్లు తెలిపారు. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపామని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే ఆ వ్యవస్థను కుప్పకూల్చిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలకు సరిపోయేలా విద్యుత్ సరఫరా చేశామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Read Also: Allu Arjun : మరోసారి పవన్ ఫ్యాన్స్..బన్నీ కి షాక్ ఇవ్వబోతున్నారా..?

కాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి నెపాన్ని ఉద్యోగుల పైకి నెట్టాలనే ఆలోచన తప్ప… విద్యుత్ కోతల లేకుండా సరిదిద్దాలనే ఆలోచన లేదన్నారు. విద్యుత్ ఉద్యోగులను నిందించే చిల్లర చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. కాగా, ఇటీవల విద్యుత్ కోతలకు కొందరు విద్యుత్ ఉద్యోగులే కారణమని, హరీశ్ రావు వారితో పవర్ కట్స్ చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • harish rao
  • revanth reddy
  • telangana
  • y power cut

Related News

Bigshock

TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థులు 8 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో ‘సింహం’ గుర్తుపై పోటీ చేసిన వీరు ఘనవిజయం సాధించి

  • Kalvakuntla Kavitha

    జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

  • Vivek

    Telangana Municipal Polls Results : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్‌కు భారీ షాక్

Latest News

  • బంగ్లాదేశ్‌కు ప్ర‌ధాని మోదీ?!

  • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

  • Valentine’s Day : లవ్ అంటే అమ్మ తంతుంది..యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

  • ఈనెల‌లో కారు కొనేవారికి గుడ్ న్యూస్‌!

Trending News

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

    • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

    • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

    • భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd