Harish Rao : అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా?: సీఎంకు హరీశ్ బహిరంగ లేఖ
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం.
- By Latha Suma Published Date - 02:42 PM, Fri - 12 July 24

Harish Rao letter to Revanth Reddy: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ(open letter) రాశారు. పేద బ్రహ్మణుల(Brahmins)కు సంక్షేమ కార్య్రమాల(Welfare activities)ను కొనసాగించాలని కోరారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ అగమ్యగోచరంగా మారిందన్నారు. రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరం. అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా? అనే ఆందోళన బ్రాహ్మణ సామాజిక వర్గంలో నెలకొందని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
అప్పట్లో సీఎంగా వున్న కేసీఆర్(kcr) బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం ఏటా రూ.100కోట్లు క్రమం తప్పకుండా కేటాయించారని గుర్తు చేశారు. వివేకానంద పేరుతో వివేశీ విద్యా పథకం, శ్రీ రమానుజ పేరుతో ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం, వేదహిత పేరుతో వేద పాఠశాలలకు, వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ప్రతి నెల వేద శాస్త్ర పండితుకు గౌరవ వేతనం, ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం, బ్రాహ్మణ యువతకు పోటీ పరీక్షల శిక్షణ వంటి పథకాలను అమలు చేసి ఎంతోమంది పేద బ్రాహ్మణ కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, విదేశీ విద్యా పథకం కింద 780 మంది పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం రూ.20లక్షల చొప్పున ఖర్చు చేసింది. 436 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ అందించింది.
Read Also: Sai Pallavi : సాయి పల్లవి కొత్త రికార్డు.. రెండేళ్లలో నాలుగు ఫిలింఫేర్..
అంతేకాక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకంగా 5,074 మందిని గుర్తించి, రూ.150 కోట్ల ఆర్థిక భరోసా కల్పించింది.బ్రాహ్మణుల గౌరవాన్ని మరింత పెంచేలా దేశంలోనే తొలిసారిగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో రూ. 12 కోట్లతో పది ఎకరాల విస్తీర్ణంలో విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మించి, బ్రాహ్మణ సంక్షేమం విషయంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. దీంతో సంక్షేమ పరిషత్ ద్వారా అమలు చేసే పథకాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా మీరు స్పందించి, ఎంతో మంది పేద బ్రాహ్మణులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరుతున్నానని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
Read Also: Redmi K70 Ultra: మార్కెట్లోకి రాబోతున్న రెడ్ మీ కే70 ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?