HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Rao Fire On White Paper

Telangana : ఇది శ్వేత పత్రం కాదు.. అబద్దపు పత్రం – హరీష్ రావు

  • Author : Sudheer Date : 17-02-2024 - 1:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao White Paper
Harish Rao White Paper

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Session) భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లో సభలో ‘శ్వేతపత్రం’ (White Paper) రిలీజ్ చేసింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో అన్నీ అసత్యాలే తెలిపారని హరీష్ పేర్కొన్నారు. ఈ శ్వేతపత్రం ఫై సుదీర్ఘంగా ఎన్ని గంటలైనా చర్చిద్దామని, ఎంత సమయమైనా కేటాయిస్తామని సభా నాయకుడు చెప్పారని .. కానీ ఇంత మంచి విషయం 30 నిమిషాల్లో చెప్పడం సాధ్యం కాదని, కనీసం తనకు 2 గంటలైనా సమయం కేటాయించాలని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతోనే శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టారు. శ్వేతపత్రాన్ని ఇప్పుడే ఇచ్చారు. ఇంత తక్కువ సమయంలో 4 సత్యదూరమైన అంశాలు గుర్తించా. మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయన్నది అసత్యం. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసిందే మేము’ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇది శ్వేత పత్రం కాదని.. అబద్దపు పత్రమని కామెంట్ చేశారు. మిడ్‌మానేరు విషయంలో మంత్రి చెప్పిందంతా అబద్దమని అన్నారు. 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిడ్‌మానేరు, ఎల్లంపల్లి తమ హయాంలో పూర్తైందన్నారు. ఈ ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలో పూర్తి అయ్యాయని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇకపై పోటీ చేసి సభలో అడుగు పెట్టబోనని సవాల్ చేశారు.

కాంగ్రెస్ తెలిపిన మొదటి అబద్దం :

మిడ్ మానేర్ ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి అయ్యింది అన్నారు. కాలేదు. అప్పుడు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేము వచ్చాక 775 కోట్లు మేము పూర్తి చేసి నీళ్ళు ఇచ్చాం.

రెండో అబద్ధం :

ఖర్చు, ఆయకట్టు విషయంలో తప్పుగా చెప్పారు. ఒక్కో పేజీలో ఒక్కో విధంగా చెప్పారు.

మూడో అబద్దం :

రాయలసీమ లిఫ్ట్ విషయంలో మేము కేంద్రానికి పిర్యాదు చేయలేదు అన్నారు. తప్పు అది. 5- 5- 2020 జీఓ నాడు వచ్చింది. అయితే జనవరి లోనే మేము కేంద్రానికి ఫిర్యాదు చేశాము.

నాల్గో అబద్దం :

కెఆర్ఎంబికి అప్పగించాలని గెజిట్ ఇస్తే మేము సవాల్ చేయలేదు అని పేజీ 14 లో చెప్పారు. అది తప్పు మేము వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్ రిఫర్ చేయాలని చెప్పాము.

ఐదో అబద్దం :

కెఅర్ఎంబి కి అప్పగించింది మేము అన్నారు. అవాస్తవం. మీరు అధికారంలోకి వచ్చాక బోర్డుకు అప్పగించినట్లు చెప్పే మినట్స్ ఆఫ్ ద మీటింగ్ ముందు పెట్టాము. ఇదే విషయం అన్ని పత్రికల్లో వచ్చింది.

ఆరో అబద్దం :

50:50 రేషియో కోసం మేము కొట్లడలేదు అన్నారు. రాష్ట్ర విభజన నుంచి ఎన్నోసార్లు కోరాం. ఫిర్యాదులు చేశాం. న్యాయమైన వాటా కోసం ట్రైబ్యునల్ వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాం అంటూ హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇక హరీష్ రావు మాట్లాడుతుండగా.. అధికార పక్షం అడ్డుతగులుతూ వచ్చింది. శ్వేతపత్రంలో పేర్కొన్న ఖర్చులు, ఆయకట్టు అంశాలు రెండుచోట్ల రెండు రకాలుగా చెప్పారని ఆరోపించారు. రూ.54,239 కోట్లు ఖర్చు పెట్టి 57.79 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని ఒకచోట చెప్పారని, మరోచోట రూ.54,234 కోట్లు ఖర్చు చేసి 41.76 లక్షల ఎకరాలకు నీరందించినట్లు చెప్పినట్లు హరీశ్‌రావు వివరించారు.

రాయలసీమ ఎత్తిపోతల టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు మా ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదనేది పచ్చి అబద్ధం. ప్రభుత్వం చట్టసభల్లో ఇలాంటి అసత్యాలతో పత్రాలు సభలో పెట్టడం సరికాదు. రాయలసీమ ఎత్తిపోతలపై 2020 మే 5న జీవో వచ్చింది. జీవో రాకముందే పత్రికల్లో వార్త ఆధారంగా 2020 జనవరి 29న కేంద్రానికి ఫిర్యాదు చేశాం. మే 5న జీవో వస్తే మే 12న కేంద్రం, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశాం. మేం ఫిర్యాదు చేసిన లేఖలు కావాలంటే ప్రభుత్వానికి పంపుతాం అన్నారు.

Read Also : SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ షాక్‌.. ఎందుకంటే..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harish rao
  • Irrigation White Paper
  • uttam kumar reddy

Related News

Harish Rao Pm

రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

  • Harish Rao Movie Tickets

    మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd