CM Revanth : ఉద్యమ స్ఫూర్తిని సీఎం రేవంత్ కించపరుస్తున్నారు – హరీష్ రావు
- By Sudheer Published Date - 08:26 PM, Fri - 9 February 24

సీఎం రేవంత్ (CM Revanth) ప్రతీసారి అగ్గిపెట్టె ముచ్చట తీసుకొస్తూ ఉద్యమ స్ఫూర్తిని కించపరుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఏదన్నా మాట్లాడితే.. అగ్గిపెట్టె ముచ్చట తీసుకువస్తారు సీఎం. నాడు అమరవీరులకు కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించలేదు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించలేదు. కాంగ్రెసోళ్లు అమరవీరుల పాడే మోసినోళ్లు కాదు. తుపాకులతో ఉద్యమకారులను బెదిరించిన మీకు తెలంగాణ పోరాటం, అమరవీరులకు గురించి తెలుస్తదని అనుకోను. ఇక అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా ఈ అగ్గిపెట్టె ముచ్చట మాట్లాడటం బంద్ చేయండి. తమను కించపరిచి, రాజకీయంగా విమర్శిస్తాం అనుకుంటే.. అది మీ రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని హరీశ్‌రావు అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున జీతాలు ఇచ్చామని సీఎం రేవంత్ చెప్పడం పచ్చి అబద్దం అని హరీష్ రావు పేర్కొన్నారు. పలు శాఖల్లో ఏడో తారీఖు వరకు కూడా జీతాలు పడ్డాయి. ఇప్పటికీ కొన్ని శాఖల్లో జీతాలే పడలేదు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు రెండు నెలల జీతాలు రాలేదు. ఐకేపీ, బీవోఏలకు జీతాలు పడలేదు. విద్యాశాఖలో సర్వశిక్షా అభియాన్‌లో జీతాలు పడని పరిస్థితి. వీటిని సీఎం కరెక్షన్ చేసుకోవాలి.. ఒకటో తారీఖున కాదు.. ఆరేడు తారీఖు వరకు జీతాలు ఇచ్చారని హరీశ్‌రావు తెలిపారు.
అలాగే జనవరి నెలలో ఆసరా పెన్షన్లు ఇవ్వలేదు. ఫిబ్రవరి ఒకటి, రెండో తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది జనవరి నెలదా..? ఫిబ్రవరి నెలదా..? స్పష్టత ఇవ్వాలి. ఒకటో తారీఖు రోజునే పెన్షన్లు ఇచ్చామని గొప్పలు చెప్పి పప్పులో కాలేశారు. ఇది కరెక్షన్ చేసుకోవాలి అని హరీశ్‌రావు సూచించారు.
Read Also : Malla Reddy : చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే కాంగ్రెస్ లోకి పట్నం మహేందర్ రెడ్డి – మల్లారెడ్డి