HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Malla Reddy Key Comments On Patnam Mahender Reddy

Malla Reddy : చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే కాంగ్రెస్ లోకి పట్నం మహేందర్ రెడ్డి – మల్లారెడ్డి

  • Author : Sudheer Date : 09-02-2024 - 8:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Malla Reddy Comments Mahend
Malla Reddy Comments Mahend

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మరోసారి వలసల పర్వం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీలోకి నేతలు చేరారో..ఇప్పుడు మరోసారి బిఆర్ఎస్ నుండి నేతలు చేరుతున్నారు. మాజీ మంత్రుల దగ్గరి నుండి కార్పొరేటర్ల వరకు చేరుతూ కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. నిన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy)..రేవంత్ (Revanth Reddy) ను కలిసిన సంగతి తెలిసిందే. రేపు ఆయన కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నారు.

ఈ తరుణంలో పట్నం మహేందర్ రెడ్డి ఫై మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) కీలక వ్యాఖ్యలు చేసారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రత్యేకంగా సతీమణితో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లకముందే పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై కర్చీఫ్ వేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవలే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా.. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ గులాబీ శ్రేణులను గందరగోళానికి గుచేస్తున్నారు. ఈ క్రమంలో మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన పరోక్ష వ్యాఖ్యలు సొంత పార్టీలో కలకలం రేపుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

అలాగే కేసీఆర్‌ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్టు తమ కుటుంబం నుంచి 3 పదవులు ఉండాలని అనుకున్నామని మల్లారెడ్డి తెలిపారు. పార్టీ అధినేత ఆదేశిస్తే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు తమ కుమారుడు భద్రారెడ్డి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. గోవాలో తనకు హోటల్‌ ఉంది. రాజకీయాల నుంచి తప్పుకొంటే అక్కడికే వెళ్లి ఎంజాయ్‌ చేస్తాను , మనిషి జీవితం ఒకేసారి వస్తుంది.. ప్రతి క్షణం జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలని మల్లారెడ్డి పేర్కొన్నారు.

Read Also : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని సన్మానించిన గవర్నర్ తమిళి సై


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chevella MP Seat
  • congress
  • malla reddy comments
  • Patnam Mahender Reddy

Related News

Mynampalli Rohith

Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌రారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృష

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Latest News

  • CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు

  • HYD : బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. అర్థరాత్రి దాడుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

  • JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd