HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Rao Fire On Cm Revant And Telangana Speaker

అసెంబ్లీని బూతులమయం చేసారంటూ కాంగ్రెస్ పై హరీశ్ రావు ఆగ్రహం

నిబంధనలను ఉల్లంఘిస్తూ శాసనసభను నడుపుతున్నారని, స్పీకర్ తీరు సరిగా లేదని హరీశ్ రావు అన్నారు. BRS MLAలతో కలిసి గన్పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. 'CM వీధి రౌడీ కంటే చిల్లరగా మాట్లాడారు. అసెంబ్లీని బూతులమయం చేశారు

  • Author : Sudheer Date : 02-01-2026 - 3:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Kasab
Kcr Kasab
  • గన్ పార్క్ వద్ద బిఆర్ఎస్ నేతల ఆందోళన
  • స్పీకర్ తీరును తప్పుపట్టిన హరీష్ రావు
  • సీఎం వీధి రౌడీ కంటే చిల్లరగా మాట్లాడుతున్నాడు

తెలంగాణ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పుడు సభ వెలుపల రాజకీయ రణరంగంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టిన హరీశ్ రావు , ప్రస్తుత శాసనసభ నిర్వహణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా, నిబంధనలను తుంగలో తొక్కి ఏకపక్షంగా నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా స్పీకర్ వ్యవహారశైలి పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.

Revanth Kcr Assembly

Revanth Kcr Assembly

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషా శైలిని హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం హోదాలో ఉండి “వీధి రౌడీ కంటే చిల్లరగా” మాట్లాడుతున్నారని, అసెంబ్లీని బూతులమయంగా మార్చారని విమర్శించారు. అత్యున్నతమైన శాసనసభలో వ్యక్తిగత దూషణలు, అమర్యాదకరమైన వ్యాఖ్యలు జరుగుతున్నా స్పీకర్ అభ్యంతరం చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రిని విమర్శించకూడదు, ప్రజా సమస్యలను ప్రశ్నించకూడదు అనుకుంటే, అసలు తాము సభకు రావాల్సిన అవసరం ఏముందని ఆయన మీడియా సాక్షిగా ప్రశ్నించారు.

అన్నింటికంటే ముఖ్యంగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి పదే పదే కేసీఆర్ గారి చావును కోరుకుంటున్నట్లుగా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో విభేదాలు ఉండవచ్చు కానీ, ఒక నాయకుడి ప్రాణాల మీదకు వచ్చేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని ఆయన హితవు పలికారు. సభలో జరుగుతున్న ఈ పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొంటూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • harish rao
  • kcr
  • Telangana Assembly
  • Telangana Speaker

Related News

Cm Revanth Reddy Kerala Cam

keralam Results : కేరళలో ‘రేవంత్’ ప్రభంజనం.. పినరయి కోటలో పాగా వేసిన తెలంగాణ ‘టైగర్’

దశాబ్ద కాలంగా పినరయి విజయన్ నాయకత్వంలో తిరుగులేని శక్తిగా ఉన్న లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (LDF)కు ఈసారి కేరళ ఎన్నికల్లో గట్టి సవాల్ ఎదురైంది

  • Kavitha Jayalalitha

    TRS : కేసీఆర్ పై మాట మార్చిన కవిత..!!

Latest News

  • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

  • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

  • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

  • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

  • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd