Hail Rains: తెలంగాణలో పలుచోట్ల కురిసిన వడగండ్ల వానలు
ఉత్తర - దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. వికారాబాద్, సంగారెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో వడగండ్ల
- Author : Maheswara Rao Nadella
Date : 16-03-2023 - 4:10 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో (Telangana) అకాల వర్షం కురిసింది . పలుచోట్ల వడగండ్ల వానలు (Hail Rains) పడ్డాయి. వికారాబాద్, సంగారెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. చేవెళ్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం (Hail Rains) పడింది. సంగారెడ్డి జిల్లాలో కోహిర్ మండలం బడంపేట్, మనియార్ పల్లిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది.
జహీరాబాద్‌లో వడగళ్ల వాన#Telangana #Zaheerabad #TelanganaRains #HyderabadRains @HiHyderabad #Rain pic.twitter.com/NLT1R7vasY
— Mothe Vikramreddy (@MVRBRS) March 16, 2023
కాగా, ఈ నెల 18న భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 5 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఝార్ఖండ్ నుంచి చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ఒడిశా వైపు కదిలినట్టు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.
Also Read: No Selfies Day: ఈరోజు ‘నో సెల్ఫీస్ డే’.. మనం కూడా పాటిస్తామా?