CM KCR Public Meeting : సీఎం కేసీఆర్ ప్రచార సభలో బుల్లెట్లు కలకలం
కేసీఆర్ ప్రసంగం చేస్తుండగా..అస్లాం అనే వ్యక్తి సభలో అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని సెక్యూరిటీ గమనించి అదుపులోకి తీసుకున్నారు
- By Sudheer Published Date - 08:37 PM, Thu - 16 November 23

బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ (CM KCR) ప్రచార సభలో బుల్లెట్లు (Gun Bullets ) కలకలం రేపాయి. ఎన్నికల ప్రచారం (Election Campaign)లో భాగంగా గత కొద్దీ రోజులుగా కేసీఆర్ తన వయసును , ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)ల్లో పాల్గొంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు మూడు నియోజకవర్గాలను కవర్ చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..పదేళ్ల బిఆర్ఎస్ (BRS) పాలనా లో జరిగిన అభివృద్ధి..తీసుకొచ్చిన పథకాలు..కట్టిన ప్రాజెక్ట్ లు , ఆసరా పెన్షన్లు ఇలా ప్రతిదీ ప్రజలకు వివరిస్తూ..కాంగ్రెస్ వస్తే మళ్లీ రాష్ట్రంలో చీకట్లోకి వెళ్తుందని తెలుపుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు కేసీఆర్ మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గం, నిజిమాబాద్ రూరల్ నియోకవర్గంలో ఆయన పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం (KCR Public Meeting at Narsapur)లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగం చేస్తుండగా..అస్లాం అనే వ్యక్తి సభలో అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని సెక్యూరిటీ గమనించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకొని..అతడి ఫై కేసు నమోదు చేసారు. ప్రస్తుతం అతడ్ని విచారిస్తున్నారు. బుల్లెట్లు ఎక్కడివి..ఎక్కడి నుండి తీసుకొచ్చాడు..? సభలోకి ఎందుకు తీసుకొచ్చాడు..? వంటి ప్రశ్నలతో విచారిస్తున్నారు.
Read Also : T-Congress Manifesto 2023 : రేపు అదిరిపోయే మేనిఫెస్టో ను రిలీజ్ చేయబోతున్న కాంగ్రెస్