Temple Tour Package : తెలంగాణలో ‘టెంపుల్ టూర్ ప్యాకేజ్’.. చాలా తక్కువ రేటుకే!
Temple Tour Package : సమ్మర్ హాలిడేస్ టైం వచ్చేసింది. ఈ టైంలో చాలామంది టూర్లకు వెళ్తుంటారు.
- Author : Pasha
Date : 23-04-2024 - 12:41 IST
Published By : Hashtagu Telugu Desk
Temple Tour Package : సమ్మర్ హాలిడేస్ టైం వచ్చేసింది. ఈ టైంలో చాలామంది టూర్లకు వెళ్తుంటారు. ఇంకెంతో మంది ఆలయాల దర్శనానికి వెళ్తుంటారు. ఇటువంటి వారికి తెలంగాణ టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు వ్యవధిలో.. ఉత్తర తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలన్నీ కవర్ చేసే టూర్ ప్యాకేజీని కేవలం 2వేల రూపాయలకే అందిస్తామని వెల్లడించింది. టికెట్ ధరలు పెద్దలకు రూ. 1999, పిల్లలకు రూ. 1,599గా నిర్ణయించారు. ఈ పర్యటన నాన్ ఏసీ కోచ్ బస్సులో కొనసాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ శని, ఆదివారాల్లో పర్యాటకులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ టూరిజం ప్యాకేజీని హైదరాబాద్ నగరం నుంచి ఆపరేట్ చేస్తున్నారు. https://tourism.telangana.gov.in/ అనే వెబ్ సైట్లోకి వెళ్లి ఈ ప్యాకేజీని(Temple Tour Package) బుక్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే +91-1800-425-46464 నంబర్‌ను కాంటాక్ట్ చేయొచ్చు.
We’re now on WhatsApp. Click to Join
రూట్ మ్యాప్ ఇదిగో..
ఈ టూర్ ఎలా కొనసాగుతుంది ? ఏయే రూట్ల మీదుగా వెళ్తుంది ? అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తొలుత బస్సు ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఉదయం 08.30 నుంచి 09.00 గంటల మధ్య హరిత హోటల్ లో టీ, బ్రేక్‌ఫాస్ట్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఉదయం 9 గంటలకు నేరుగా వేములవాడకు బయల్దేరుతారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల మధ్యలో వేములవాడ రాజన్న ఆలయానికి బస్సు చేరుకుంటుంది. అక్కడ స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 12.15 గంటలకు కొండగట్టు ఆలయానికి బస్సు చేరుకుంటుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం సమీపంలోని హారిత హోటల్‌కు చేరుకొని భోజనం చేస్తారు.
Also Read :20 Years Jail : గర్ల్ ఫ్రెండ్ ఆ విషయం చెప్పిందని దారుణ హత్య.. 20 ఏళ్ల జైలుశిక్ష
మధ్యాహ్నం ధర్మపురికి..
మధ్యాహ్నం 2.30 గంటలకు ధర్మపురికి బస్సులో బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ధర్మపురి ఆలయానికి చేరుకుంటారు. దర్శనం ముగిసిన అనంతరం టీ బ్రేక్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు బస్సు హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరుతుంది. రాత్రి 10 గంటలకు నగరానికి బస్సు చేరుకుంటుంది. ఈవిధంగా 1 రోజూ ఆలయాల టూర్ ముగుస్తుంది.