Gaddar Statue : గద్దర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
- Author : Sudheer
Date : 30-01-2024 - 5:26 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar statue) విగ్రహ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధి తెల్లాపూర్ మున్సిపాలిటీలోని రామచంద్రాపురంలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లభించింది. గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు విగ్రహం ఏర్పాటు చేసే౦దుకు పనులు కొనసాగుతుండగా గద్దర్ అంటే గిట్టని కొందరు వ్యక్తులు, హెచ్‌ఎండీఏ(HMDA) అధికారులు, పోలీసులు పనులు జరుగకుండా చూస్తున్నారని ఆరోపిస్తూ పలు సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చి విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
వాస్తవానికి గద్దర్ విగ్రహాన్ని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేయాలని అంతా సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతం హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తుందని కొందరు ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. దాంతో కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మరికొందరు నేతలు, సంఘాలు అధికారులు, పోలీసుల తీరును తప్పుపట్టారు. భరత్ చేపట్టిన దీక్షకు వివిధ పార్టీలు, హెచ్సీయూ స్టూడెంట్లు, పీఎస్టీయూ స్టూడెంట్ సంఘాల నేతలు, స్థానికులు సంఘీభావం తెలిపారు. ఇక ఇప్పుడు ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో అడ్డంకులు తొలిగినట్లు అయ్యింది.
Read Also : Saripodhaa Sanivaaram: అల్లు అర్జున్ కి పోటీగా నిలుస్తున్న నాని.. బన్నీ వెనక్కి తగ్గనున్నాడా?