Saripodhaa Sanivaaram: అల్లు అర్జున్ కి పోటీగా నిలుస్తున్న నాని.. బన్నీ వెనక్కి తగ్గనున్నాడా?
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలు అందరూ చేతినిండా వరస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది వచ్చే ఏడాది టాలీవుడ్ లో సినిమాల జా
- By Nakshatra Published Date - 05:26 PM, Tue - 30 January 24
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలు అందరూ చేతినిండా వరస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది వచ్చే ఏడాది టాలీవుడ్ లో సినిమాల జాతర జరగనుంది. యంగ్ హీరోల నుంచి పాణి ఇండియా హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీ గా గడుపుతున్నారు. అంతేకాకుండా పండుగలు, స్పెషల్ రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఒకేసారి సినిమాలు విడుదల చేస్తూ స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే.. పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.
ఇప్పటికే చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ ఇటీవలే మరోసారి మరో పోస్ట్ ని కూడా విడుదల చేశారు. ఇకపోతే నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతి స్టాత్మికంగా నిర్మిస్తున్నారు డివివి దానయ్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఆగష్టు 15న పుష్ప 2 వచ్చేందుకు డేట్ ని ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని రోజుల నుంచి ఆ మూవీ పోస్టుపోన్ అయ్యే ఛాన్స్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒకవేళ ఆ తేదికి పుష్ప రాకపోతే ఆ డేట్ ని కబ్జా చేసేందుకు కొందరు నిర్మాతలు తమ సినిమాలతో క్యూలో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే డివివి కూడా వేచి చూస్తున్నారు. ఆగష్టు 15కి పుష్ప 2 రాకుంటే.. సరిపోదా శనివారం చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ డివివి చెబుతున్నారు. మరి పుష్ప వెనక్కి తగ్గుతాడా? లేదా తగ్గేదేలే అంటూ అదే తేదికి వచేస్తాడా? అనేది చూడాలి మరి. కానీ పుష్ప మేకర్స్ మాత్రం ఆ డేట్ కి వెనక్కి తగ్గేది లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా అనౌన్స్ చేసిన తేదీకి విడుదల చేస్తాము అంటూ పట్టుకుని కూర్చున్నారు.
Related News
Sudheer Babu Haromhara Postponed : బాధగా ఉన్నా తప్పలేదు అంటున్న సుధీర్ బాబు.. ఇంతకీ ఏమైంది అంటే..?
Sudheer Babu Haromhara Postponed సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక డైరెక్షన్ లో వస్తున్న సినిమా హరోమ్హర. ప్రచార చిత్రాలతో సినిమాపై బజ్ తీసుకు రాగా సినిమా తో