Twitter War : గవర్నర్ వర్సెస్ మంత్రి.. మెడికల్ కాలేజీల కేటాయింపుపై ట్విట్టర్ వార్
మెడికల్ కాలేజీ కేటాయింపుపై తెలంగాణ గవర్నర్ తమిళసై, మంత్రి హరీష్‌రావుల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. రాష్ట్రానికి
- By Prasad Published Date - 06:51 PM, Sun - 5 March 23

మెడికల్ కాలేజీ కేటాయింపుపై తెలంగాణ గవర్నర్ తమిళసై, మంత్రి హరీష్‌రావుల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. రాష్ట్రానికి కేంద్రం వైద్య కళాశాలల కేటాయింపుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారనే దానిపై ట్విటర్ లో అడిగిన ప్రశ్నకు గవర్నర్ స్పందిస్తూ.. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య చెప్పినట్లుగా సకాలంలో దరఖాస్తు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సమాధానం ఇచ్చారు. గవర్నర్ ట్వీట్‌పై హరీష్‌రావు స్పందిస్తూ, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) బీబీనగర్ పూర్తికి అంచనా వేసిన రూ.1365 కోట్లలో కేంద్రం కేవలం రూ.156 కోట్లు మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. గుజరాత్ ఎయిమ్స్‌కు 52 శాతం నిధులు కేటాయించగా తెలంగాణకు 11.4 శాతం నిధులు ఎందుకు వచ్చాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.
Amazing infrastructure to match international standards from honb @PMOIndia GoI funded visionary schemes PMSSY one medical college in every district accross Nation. Such facilities will add on to promote medical tourism potential in future. https://t.co/2CeEpFkRAd
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 5, 2023
ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో వాగ్దానం చేసిన విధంగా గిరిజన విశ్వవిద్యాలయం మరియు రైలు కోచ్ ఫ్యాక్టరీ కోసం రాజ్‌భవన్ దృష్టి సారించి.. కేంద్ర ప్రభుత్వానికి తెలిపితే తెలంగాణ ప్రజలకు ఇది గొప్ప సహాయంచ చేసినట్లేనని గవర్నర్‌ని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. టీఎస్‌కు జరిగిన అన్యాయంపై ఎవరూ ఎందుకు గొంతు విప్పరు? తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని ఎందుకు తప్పు పట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా మెడికల్ కాలేజీల మంజూరులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నది వాస్తవం’ అని ట్వీట్ చేశారు. కేంద్రం ఆమోదించిన 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదన్నారు. మూడు దశల కాలేజీల కేటాయింపుల్లోనూ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపి తెలంగాణను మోసం చేసిందని ఆయన అన్నారు.
Instead of giving funds to Bibinagar AIIMS which is supposed to be on par with Delhi AIIMS, Union Minister makes false claims blaming TS govt.
Why only ₹156cr of ₹1365cr released & Why Gujarat AIIMS gets 52% of funds while TS gets 11.4% when both were sanctioned in 2018 4/5 pic.twitter.com/6e20WHS1uy— Harish Rao Thanneeru (@BRSHarish) March 5, 2023
ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కేటాయించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సొంత నిధులతో 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వైద్య కళాశాలలను కేటాయించామన్నారు. 2018లో రెండు ప్రాజెక్టులకు మంజూరైనా గుజరాత్ ఎయిమ్స్‌కు 52 శాతం అంచనా నిధులు వస్తే తెలంగాణకు 11.4 శాతం మాత్రమే ఎందుకు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

Related News

Power Strike: మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్న విద్యుత్ ఉద్యోగులు.. డెడ్ లైన్ ఫిక్స్!
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మరో మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నారు.