Hyd : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గౌతం రావు
Hyderabad MLC Poll : ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది
- Author : Sudheer
Date : 04-04-2025 - 12:25 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ(MLC)గా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో హడావిడి మొదలైంది. భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థిని ప్రకటిస్తూ, సీనియర్ నాయకుడు డాక్టర్ ఎన్. గౌతమ్ రావును రంగంలోకి దించింది. పార్టీ అధిష్టానం ఈరోజు అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. ఈ సందర్భంగా గౌతమ్ రావు పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం మార్చి 24న షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
Minister Lokesh : మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా : మంత్రి లోకేశ్
ప్రస్తుతం హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా పనిచేస్తున్న ఎం.ఎస్. ప్రభాకర్ పదవీకాలం మే 1న ముగియనుండటంతో, ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 4 వరకూ గడువు ఉండగా, ఏప్రిల్ 7న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉపసంహరణకు ఏప్రిల్ 9 వరకు అవకాశం ఉంది. ఎన్నికల తుది పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 25న నిర్వహించి, ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.