HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News Jobs For 30 Thousand People In Three Years In Telangana

30 Thousand Jobs: గుడ్ న్యూస్‌.. తెలంగాణ‌లో మూడేళ్లలో 30వేల మందికి ఉద్యోగాలు!

అనుకూలమైన వాతావరణం ఉండటంతో హైదరాబాద్ లో జీసీసీలను ప్రారంభించేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ రంగంలో ఏర్పాటవుతున్న జీసీసీల‌ సంఖ్య పెరుగుతోంది.

  • Author : Gopi Date : 16-02-2025 - 8:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
30 Thousand Jobs
30 Thousand Jobs

30 Thousand Jobs: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బీటెక్ ప‌ట్ట‌భ‌ద్రుల‌కు ప్రారంభించిన ‘బీఎఫ్ఎస్ఐ – స్కిల్లింగ్’ కోర్సుకు విశేష స్పందన లభిస్తోంది. ఆదివారం నిర్వహణ అర్హత పరీక్ష జరిగింది. వీరిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది జూలై వరకు బ్యాంకింగ్ ఆప‌రేష‌న్స్‌, ఫైనాన్షియ‌ల్ మార్కెట్స్‌, ఇన్సూరెన్స్‌, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్‌, సాఫ్ట్ వేర్‌, ప్రోగ్రామింగ్‌, అప్లికేష‌న్ అండ్ డేటాబేస్‌, సైబ‌ర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్‌, సాఫ్ట్ స్కిల్స్ త‌దిత‌ర అంశాల‌పై యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (yisu.in) లో శిక్షణ ఇస్తారు. అనంతరం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)కు సంబంధించిన హైదరాబాద్ లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)లో ప్లేస్ మెంట్స్ (30 Thousand Jobs) కల్పిస్తారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించి, తెలంగాణను నైపుణ్యం కలిగిన మానవ వనరులకు చిరునామాగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి సంక్పలించారు.

అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టారు. పరిశ్రమల అవసరాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ.. అందుకు అనుగుణంగా కొత్త కోర్సులను తెలంగాణ యువతకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. అనుకూలమైన వాతావరణం ఉండటంతో హైదరాబాద్ లో జీసీసీలను ప్రారంభించేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ రంగంలో ఏర్పాటవుతున్న జీసీసీల‌ సంఖ్య పెరుగుతోంది.

Also Read: RCB: ఆర్సీబీకి బిగ్ షాక్‌.. తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో 3 మాత్ర‌మే బెంగ‌ళూరులో!

వీటిల్లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కేలా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పించాలని మంత్రి శ్రీధర్ బాబు సంకల్పించారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో అనుభవమున్న దేశీయ, యూఎస్ఏ, సింగపూర్ నిపుణులు, జీసీసీల నిర్వాహకులను సంప్రదించారు. వారి సూచనలు సలహాలతో ‘బీఎఫ్ఎస్ఐ- స్కిల్లింగ్’ పేరిట ప్రత్యేక కోర్సును స్కిల్ యూనివర్సిటీలో అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ఏటా 10వేల మందికి శిక్షణ ఇస్తారు.

వీరిలో 5వేల మంది ఇంజినీరింగ్, మరో 5వేల మంది డిగ్రీ పట్టభద్రులుంటారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం బీఎఫ్ఎస్ఐ జీసీసీల్లో ఉద్యోగాలు ఇస్తారు. అంటే.. రానున్న మూడేళ్లలో 30వేల మంది తెలంగాణ యువతకు ఈ కోర్సు ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గతేడాది సెప్టెంబర్ లో మొదటి బ్యాచ్ ప్రారంభమయ్యింది. దీని నిర్వహణకయ్యే ఖర్చును ఎక్విప్(equipp), బీఎఫ్ఎస్ఐ కన్సార్షియం భరిస్తుంది.

విద్యార్థులు స్వల్ప అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే చాలు. సర్టిఫికేట్, ఇతర అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం అభ్యర్థుల నుంచి ఒక్కసారి రూ.5వేలు వసూలు చేస్తారు. ఇప్పటికే రెండు బ్యాచ్ లను విజయవంతంగా పూర్తి చేసినట్లు కోర్సు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం మూడో బ్యాచ్ కోసం అర్హత పరీక్షలను నిర్వహించారు. ఉద్యోగాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న ప‌ట్ట‌భ‌ద్రులు స్కిల్స్ యూనివ‌ర్సిటీ వెబ్ సైట్‌(yisu.in )ను త‌ర‌చూ సంద‌ర్శించాల‌ని కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 30 Thousand Jobs
  • hyderabad
  • jobs
  • Placements
  • Revanth Sarkar
  • telangana

Related News

IMD Alert

Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎమ్‌డీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ శనివారం వరకు అమల్లో ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసర

  • KTR

    ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd