HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For Gig Workers In Telangana

తెలంగాణలోని గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్..

  • Author : Vamsi Chowdary Korata Date : 21-02-2026 - 9:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gig Workers
Gig Workers

Telangana Government  తెలంగాణలోని గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్. త్వరలోనే గిగ్ కార్మికుల సంక్షేమ బిల్లుకు చట్టబద్ధత రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లుకు చట్టబద్దత తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది. బిల్లుకు చట్టబద్ధత వస్తే.. ప్రత్యేక బోర్డు ద్వారా గిగ్ కార్మికులకు ఇన్సూరెన్స్, పెన్షన్లు, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, ప్రసూతి సహాయం వంటివి అందనున్నాయి.

  • తెలంగాణలోని గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్
  • సంక్షేమ బిల్లుకు త్వరలో చట్టబద్ధత
  • ప్రత్యేక బోర్డు ద్వారా కార్మికులకు సాయం

తెలంగాణలోని గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా గిగ్ వర్కర్లతో సమావేశమై.. వారి సంక్షేమం కోసం పాటుపడతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిగ్‌వర్కర్ల ఉద్యోగ భద్రత, రక్షణ, సామాజిక భద్రత కల్పించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్‌వర్కర్ల (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు-2025కు సర్కార్ చట్టబద్ధత ఇవ్వనుంది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిన ఈ బిల్లును ఈనెలాఖరున జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించి.. బిల్లుకు చట్టబద్ధత తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండురోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గతంలో ఇచ్చిన హామీ మేరకు గిగ్‌వర్కర్ల చట్టాన్ని త్వరగా తీసుకురావాలని రాహుల్‌ గాంధీ సీఎం రేవంత్‌కు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు కార్మిక శాఖ కార్యాచరణ రూపొందించింది. ఈ బిల్లుకు చట్టబద్ధత లభిస్తే తెలంగాణలో పనిచేస్తున్న దాదాపు నాలుగు లక్షల మంది గిగ్‌ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. వారికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుతోపాటు కార్మికులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ కానుంది. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకనిధిని సైతం ఏర్పాటు చేస్తుంది. గిగ్‌వర్కర్లకు సంబంధించిన బిల్లును గత ఏడాదే కేబినెట్ ఆమోదం తెలిపింది.

గిగ్‌వర్కర్ల సంక్షేమం కోసం ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక బోర్డుకు ఛైర్మన్‌గా కార్మికశాఖ మంత్రి, సభ్యులుగా ఇతర కార్మిక శాఖ అధికారులు, ప్రతినిధులు ఉంటారు. గిగ్, అగ్రిగేటర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లు ఈ చట్టానికి లోబడి బోర్డు వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కార్మికుల వివరాలను సంక్షేమ బోర్డు వెబ్‌పోర్టల్‌లో నమోదు చేస్తుంది. అగ్రిగేటర్లు 60 రోజుల్లో నమోదైన గిగ్‌వర్కర్ల డేటాను బోర్డుకు ఇవ్వాల్సి ఉంటుంది. సామాజిక భద్రత, ఇన్సూరెన్స్ పథకాల కోసం ప్రభుత్వం సంక్షేమ నిధిని సైతం ఏర్పాటు చేయనుంది. ఈ నిధికి అగ్రిగేటర్లు గిగ్‌వర్కర్‌కు ప్రతి లావాదేవీకి చేసే చెల్లింపుల్లో 1 శాతానికి తక్కువ 2 శాతానికి మించకుండా జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధి ద్వారా ఇన్సూరెన్స్, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ప్రసూతి సహాయం బోర్డు అందించనుంది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanthreddy
  • Congress Government
  • delivery boys
  • Gig Workers
  • Gig Workers Act
  • Legalized
  • Swiggy
  • telangana government
  • Welfare Bill
  • zomato

Related News

Valentine's Day Condoms

Valentine’s Day : ప్రేమికుల రోజును కాస్త ‘కండోమ్స్ డే’ గా మార్చారు కదరా..మీ దుంపతెగ !!

ఒకప్పుడు ప్రేమికుల రోజు వచ్చిందంటే పూల మార్కెట్లు కిక్కిరిసిపోయేవి. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో ఆ ట్రెండ్ మారింది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే నాడు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి యాప్స్‌లో పువ్వులు, గిఫ్ట్ ప్యాక్‌ల కంటే కండోమ్స్ మరియు ఇతర శృంగార అనుబంధ ఉత్పత్తులకే అత్యధికంగా

    Latest News

    • Trump’s 10% Global Tariffs : 10% గ్లోబల్ టారిఫ్ లాభమా? నష్టమా?

    • Labour pain : ప్రసవ వేదన భరించలేక కత్తితో కడుపును కోసుకున్న మహిళ !!

    • ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు.. చివరకు ఆత్మహత్య ! అసలు ఏంజరిగింది ?

    • Golisoda : అక్కడ ఆ తాత గోలీ సోడా కు మాములు డిమాండ్ లేదు..అంత స్పెషల్ ఏంటో చూడండి!!

    • Tomatoes For Free : టమాటా ధర రివర్స్..మొన్న కేజీ రూ.100 , నేడు ఫ్రీ గా ఇచ్చే పరిస్థితి !!

    Trending News

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

      • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

      • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

      • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd