HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For Anganwadi Students

Good News : అంగన్‌వాడీ విద్యార్థులకు గుడ్‌న్యూస్

Good News : హైదరాబాద్‌లోని 914 కేంద్రాల్లో ఉన్న 29 వేల మంది చిన్నారుల్లో 90 శాతం మంది తల్లిదండ్రులు ఉదయాన్నే పనులకు వెళ్తున్నారు. దీంతో పిల్లలకు సరియైన ఆహారం అందడం లేదు. ఈ సమస్యను గుర్తించిన కొంతమంది టీచర్లు

  • Author : Sudheer Date : 02-11-2025 - 4:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anganwadi Centers
Anganwadi Centers

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహార లోపాన్ని నివారించేందుకు, వారికి మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ముందుగా.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని మొత్తం 3,253 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా సుమారు 1.50 లక్షల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది. బాలల దినోత్సవం సందర్భంగా నవంబరు 14వ తేదీన ఈ అల్పాహారం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పాలు, చిరుతిండ్లు, మధ్యాహ్న భోజనం మాత్రమే అందిస్తున్నారు. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఉదయాన్నే పనులకు వెళ్లే తల్లిదండ్రులు తమ పిల్లలకు సరిగా అల్పాహారం అందించలేకపోతున్నారు.

Liquor Tenders in Telangana : మద్యం దుకాణం దక్కించుకున్న ప్రభుత్వ టీచర్..కాకపోతే !!

హైదరాబాద్‌లోని 914 కేంద్రాల్లో ఉన్న 29 వేల మంది చిన్నారుల్లో 90 శాతం మంది తల్లిదండ్రులు ఉదయాన్నే పనులకు వెళ్తున్నారు. దీంతో పిల్లలకు సరియైన ఆహారం అందడం లేదు. ఈ సమస్యను గుర్తించిన కొంతమంది టీచర్లు, అధికారులు కొద్ది నెలల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విన్నపాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు వివరించగా.. ఆమె గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అల్పాహారం అందించే ప్రతిపాదనకు తక్షణమే అంగీకరించారు. చిన్నారుల వయస్సును, పోషక విలువలను పరిగణలోకి తీసుకుని మెనూను రూపొందించారు. ఇందులో భాగంగా, చిన్నారులకు ఇడ్లీ, ఉప్మా, రాగిజావ, అటుకుల ఉప్మా వంటి ఆరోగ్యకరమైన, సులభంగా జీర్ణమయ్యే అల్పాహారాన్ని అందించనున్నారు.

ఒకవైపు అల్పాహారం పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు కేంద్రాల నిర్వహణ సమస్యలపై అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 70 శాతానికి పైగా కేంద్రాలు ఒకే గదిలో కొనసాగుతున్నాయి. ఆ గదిలోనే పిల్లలకు భోజనం వండటం, వడ్డించడం, వారికి పాలు, పౌష్టికాహారం నిల్వ చేయడం వంటివి చేయాల్సి వస్తోంది. దీంతో 20 మందికి పైగా చిన్నారులు ఉన్న కేంద్రాల్లో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.

ఈ ఇబ్బందులను తొలగించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఉన్న వనరుల్లోనే సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా, పంజాగుట్ట, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్‌ వంటి ప్రాంతాల్లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలల్లో తగినన్ని గదులు అందుబాటులో ఉంటే, ఆ పాఠశాలల ప్రాంగణంలోకి అంగన్‌వాడీ కేంద్రాలను మార్చే ప్రక్రియను ప్రారంభించారు. ఇది చిన్నారులకు మెరుగైన వాతావరణాన్ని, పరిశుభ్రమైన స్థలాన్ని అందిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anganwadi food menu
  • Anganwadi Students
  • good news
  • telangana

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd