Gold Price Today : బడ్జెట్ వేళ పెరిగిన బంగారం ధరలు..!
Gold Price Today : భారతదేశంలో బంగారానికి మస్తు డిమాండ్ ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగలు ఇతర వేడుక ఏదైనా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఇది అంతలా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. ఇక రేట్ల విషయానికి వస్తే ఇటీవల రికార్డు స్థాయిలో గోల్డ్ రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం జీవనకాల గరిష్టాలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మరి ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- By Kavya Krishna Published Date - 08:56 AM, Sat - 1 February 25

Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇటీవలి కాలంలో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు, తగ్గుతాయనే అంచనాల మధ్య మళ్లీ భారీగా పెరిగి షాక్ ఇస్తున్నాయి. వరుసగా గరిష్ట స్థాయిలను నమోదు చేస్తూ మరోసారి రికార్డు ధరల వైపు పయనిస్తున్నాయి. తాజాగా, కేంద్ర బడ్జెట్ 2025 సందర్భంగా మరోసారి పసిడి పరుగులు పెట్టింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినా, బంగారం రేట్లు పెరుగుతుండటం గమనార్హం. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు పసిడి ధరలు పెరుగుతాయి. కానీ, ఇప్పుడు వడ్డీ రేట్లు మారకుండానే గోల్డ్ రేట్లు రికార్డు స్థాయికి చేరడం ఆశ్చర్యం కలిగించే అంశంగా మారింది.
Sit and Work : ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారా?
అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2810 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు కాస్త తగ్గి 2798 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక వెండి ధర స్పాట్ మార్కెట్లో 31.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో రూపాయి మారకం విలువ క్షీణిస్తూ 86.72 రూపాయల వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్ బంగారం ధరలు
దేశీయంగా కూడా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ఒక్కరోజులోనే రూ. 1200 పెరిగి తులానికి రూ. 77,300 కి చేరింది. గత రెండు రోజులుగా వరుసగా రూ. 150, రూ. 850 చొప్పున పెరుగుతూ వచ్చాయి. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1310 పెరిగి 10 గ్రాములకు రూ. 84,330కి చేరింది.
ఢిల్లీ గోల్డ్ రేట్లు
హైదరాబాద్ మాదిరిగానే ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్లు పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1200 పెరిగి తులానికి రూ. 77,450కి చేరింది. 24 క్యారెట్ల ధర రూ. 1310 పెరిగి తులానికి రూ. 84,480 వద్ద ట్రేడవుతోంది.
వెండి ధరల పెరుగుదల
బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1000 పెరిగి రూ. 99,500 కి చేరింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు మరింత ఎక్కువగా పెరిగి కిలోకి రూ. 1.07 లక్షలకు చేరింది. స్థానిక పన్నులు, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ వంటివి గోల్డ్, సిల్వర్ ధరల మార్పుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ ప్రభావంతోనే హైదరాబాద్ కంటే ఢిల్లీలో బంగారం ధరలు ఎక్కువగా ఉండగా, వెండి ధరలు కొంత తక్కువగా ఉంటున్నాయి.
Jio Plan : జియో యూజర్లకు బిగ్ షాక్