HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ghmc Takes Key Decision To Keep The City Cleaner

Hyderabad : నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు GHMC కీలక నిర్ణయం

Hyderabad : పారిశుద్ధ్య నియమాలను ఉల్లంఘించేవారిపై ఇప్పటి వరకు స్వల్పంగా జరిమానాలు విధించేవారు

  • By Sudheer Published Date - 01:02 PM, Wed - 5 March 25
  • daily-hunt
Ghmc
Ghmc

హైదరాబాద్‌(Hyderabad)ను మరింత పరిశుభ్రంగా మార్చేందుకు జీహెచ్ఎంసీ (GHMC) కీలక నిర్ణయాలను తీసుకుంది. పారిశుద్ధ్య నియమాలను ఉల్లంఘించేవారిపై ఇప్పటి వరకు స్వల్పంగా జరిమానాలు విధించేవారు. కానీ ఇకపై మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఈ చర్యల అమలును పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నారు. టీసీఎస్ సంస్థ దీనిని అభివృద్ధి చేస్తుండగా, వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది. యాప్ ప్రారంభమైన వెంటనే అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు, తద్వారా వారు ప్రజలకు సరైన అవగాహన కల్పించగలరు. ఈ యాప్ ద్వారా ప్రతి అధికారి తన లాగిన్ వివరాలు పొందిపొందనున్నారు. పారిశుద్ధ్య ఉల్లంఘనలు గుర్తించిన వెంటనే వాటికి సంబంధించిన ఫోటోను యాప్‌లో అప్లోడ్ చేయాలి. దీంతో ఉల్లంఘన చేసిన వ్యక్తికి డిజిటల్ రసీదు జనరేట్ అవుతుంది. జరిమానా సమాచారం ఆయా వ్యక్తులకు వాట్సాప్ లేదా SMS ద్వారా పంపబడుతుంది. ఈ విధానం వల్ల పారదర్శకత పెరిగి, పారిశుద్ధ్య నియమాలను ప్రజలు మరింతగా పాటించే అవకాశముంది.

Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఖాయమేనా ?

జరిమానాల పరంగా చూస్తే.. రోడ్డుపై చెత్త వేసిన వారికి రూ.100, బహిరంగ మూత్ర విసర్జన చేస్తే రూ.100 జరిమానా విధించనున్నారు. దుకాణదారులు రోడ్డుపై చెత్త వేస్తే, గోడలపై రాతలు రాస్తే రూ.1,000 జరిమానా విధించనున్నారు. అలాగే గోడలపై పోస్టర్లు అంటిస్తే రూ.2,000, అనుమతి లేకుండా బ్యానర్లు, కటౌట్లు కడితే రూ.5,000 జరిమానా విధించనున్నారు. మరీ ముఖ్యంగా నాలాల్లో చెత్త వేస్తే రూ.10,000 జరిమానా విధించనున్నారు. ఈ నూతన చర్యలు నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయని అధికారులు అంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ప్లాస్టిక్ కవర్లు నిల్వ చేసేవారికి మొదటి తప్పుకు రూ.10,000 జరిమానా, రెండోసారి రూ.25,000 జరిమానా విధించనున్నారు. మూడోసారి ఇదే తప్పు చేస్తే దుకాణాన్ని మూసివేయనున్నారు. ఇక నిర్మాణ వ్యర్థాలను అనుమతి లేని వాహనాల్లో తరలిస్తే రూ.50,000 జరిమానా విధించనున్నారు. ఈ కొత్త చర్యల ద్వారా హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, ప్రజల్లో బాధ్యతను పెంచే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగేస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GHMC
  • GHMC Fines
  • GHMC New App
  • hyderabad

Related News

BRS

BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అక్రమాలపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి రెండు సంవత్సరాలుగా ఆరు గ్యారంటీలపై సమీక్ష పెట్టడానికి సమయం దొరకలేదని, ఎన్నికల సమయంలో ఇప్పుడు రివ్యూ పెట్టడం జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడానికేనని ఆరోపించారు.

  • Messi

    Messi: డిసెంబ‌ర్‌లో హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ!

  • Hyd Real Estate

    Hyderabad : హైదరాబాద్ అడ్డాగా ఉగ్రకుట్రకు ప్లాన్

  • Ar Rahman Concert

    AR Rahman Concert : రామోజీ ఫిలిం సిటీ లో అట్టహాసంగా జరిగిన రెహమాన్‌ కాన్సర్ట్‌

  • Flight Delay Passengers Pro

    Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం

Latest News

  • Vipraj Nigam: ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆట‌గాడిని బెదిరించిన మ‌హిళ‌..!

  • Train: రైళ్లు ఆల‌స్యం కావ‌టానికి కార‌ణం మ‌న‌మేన‌ట‌!

  • SSMB29: మహేష్ బాబు- రాజమౌళి ‘SSMB29’ ఫస్ట్ సింగిల్ విడుదల.. టైటిల్ ఇదేనా!

  • CSK Cricketer: న‌టిని పెళ్లి చేసుకోబోతున్న సీఎస్కే మాజీ ఆట‌గాడు!

  • Delhi Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో భారీ పేలుడు!

Trending News

    • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd