Smugglers: రూటు మార్చిన స్మగ్లర్లు, సినిమా తరహాలో గంజాయి సప్లయ్
స్మగ్లర్లు అంతర్గత ‘సురక్షిత’ రహదారుల ద్వారా గంజాయి అక్రమ రవాణా చేస్తుండటం గమనార్హం.
- By Balu J Published Date - 12:00 PM, Tue - 12 September 23

Smugglers: పోలీసుల నిఘా కారణంగా డ్రగ్స్, గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లు ఇట్టే దొరికిపోతున్నారు. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలను కలిపే హైవేల మార్గాల్లో సప్లయ్ చేసే స్మగ్లర్లు అంతర్గత ‘సురక్షిత’ రహదారుల ద్వారా గంజాయి అక్రమ రవాణా చేస్తుండటం గమనార్హం. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించకుండా పోలీసుల కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ రెచ్చిపోతూనే ఉన్నారు.
జీపీఎస్ మ్యాప్ సేవలను వినియోగించుకోవడం ద్వారా టోల్ ప్లాజాలు లేని మార్గాలను స్మగ్లర్లు ఎంచుకుంటున్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు. స్మగ్లర్లు కూడా రెండు లేదా మూడు వాహనాల కాన్వాయ్‌లో ప్రయాణిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. విశాఖపట్నం, ఒడిశా నుండి గంజాయి రవాణా చేసే స్మగ్లర్లు ఎక్కువగా విజయవాడ, కోదాడ, చౌటుప్పల్ మరియు నగర శివార్లలోని పెద్ద అంబర్‌పేట సమీపంలోని ORR మీదుగా వచ్చేవారు. అయితే ఈ మార్గంలో స్మగ్లర్లను కట్టడి చేయడంతో వారు వెనక్కి తగ్గాల్సి వస్తోందని పోలీసులు తెలిపారు. అయితే కొందరు తెలివిగా పుష సినిమాలో మాదిరిగా వ్యాన్సుల్లో, ట్రక్కుల్లో సరుకు సప్లయ్ చేస్తూ దొరికిపోతున్నారు. ఇదంతా పుష్ప సినిమా ఎఫెక్ట్ అని తెలుస్తోంది.
ఈ మార్గాల్లో తరలింపు
విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుండి విజయవాడ, గుంటూరు, మాచర్ల, నల్గొండ, కల్వకుర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్ మరియు సంగారెడ్డి, మహారాష్ట్ర, కర్ణాటకలకు
విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుండి రాజమండ్రి, గతంలో ఖమ్మం, వరంగల్ మరియు మహారాష్ట్ర మరియు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు జిల్లాలు
విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుండి గతంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ మరియు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వైపు
సంగారెడ్డి నుండి కామారెడ్డి మరియు మహారాష్ట్ర వైపు మీదుగా వెళ్తూ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు.
Also Read: D Srinivas: డీఎస్ పరిస్థితి విషమం.. ఐసీయూలో ట్రీట్ మెంట్!