Hyderabad : పదోతరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..!! వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్..!!
- Author : hashtagu
Date : 29-11-2022 - 10:07 IST
Published By : Hashtagu Telugu Desk
కఠిననిబంధనలు ఎన్ని తీసుకువచ్చినా…మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో దారుణం జరిగింది. పదోతరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈఘటన హయత్ నగర్ మండలం తట్టిఅన్నారంలో జరిగింది. అత్యాచారం సమయంలో నిందితుల వీడియో కూడా తీశారు. ఈవిషయం బయటకు చెబితే …ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బాధితురాలిని బెదిరించారు.
10రోజుల తర్వాత మరోసారి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మళ్లీ వీడియో తీసారు. ఈ వీడియోను తోటి విద్యార్థులకు పంపించారు. దీంతో ఈ ఘటన బయటపడింది. బాధితు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.