HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Free Power Politics On Brs And Congress

BRS vs Congress : బీఆర్ఎస్ ‘‘పవర్’’ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్ కాంగ్రెస్‌దేనంటున్న హ‌స్తం పార్టీ నేత‌లు

ఉచిత విద్యుత్ ప్రారంభ‌మైంది కాంగ్రెస్ పాల‌న‌లోనేన‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలోనే ఆ క‌ల నెరవేరింది.

  • Author : Prasad Date : 13-07-2023 - 6:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress BRS
Congress BRS

ఉచిత విద్యుత్ ప్రారంభ‌మైంది కాంగ్రెస్ పాల‌న‌లోనేన‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలోనే ఆ క‌ల నెరవేరింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెరుగుతున్న వేళ అంతుచిక్కని బీఆర్ఎస్ పవర్ రాజకీయం మొదలు పెట్టింది. ఉచిత విద్యుత్‌పై ప్రగతి భవన్ లో కొత్త స్కెచ్ సిద్ధం చేసారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించి, కాంగ్రెస్ కు ఉచిత విద్యుత్ రద్దు అంటుందంటూ ఆగమాగం చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా గులాబీ నేతలు రోడ్డు ఎక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన ఉచిత విద్యుత్ నే కేసీఆర్ కొనసాగిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ జోరును తట్టుకోవటం పైన ప్రగతి భవన్ లో మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ ను ఎలా బద్నాం చేయాలనే ఆలోచన పైన తర్జన భర్జన పడుతున్నారు. రేవంత్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. కట్ పేస్ట్ నైపుణ్యంతో ఒక వీడియో బయటకు తీసుకొచ్చారు. అంతే రైతులకు ఉచిత విద్యుత్ కు కాంగ్రెస్ వ్యతిరేకమనే ప్రచారం తెర మీదకు తెచ్చారు. పార్టీ నేతలంతా రోడ్డు మీదకు రావాలని ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్ లో ప్రజలకు మద్దతు పెరుగుతున్న వేళ రాజకీయంగా అడ్డుకునేందుకు అస్త్రాలు లేవు. దీంతో అసత్యాలే ఆయుధంగా ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కీ లాంటి వారు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు.

అసలు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్. 2004 ఎన్నికల వేళ నాటి సీఎం చంద్రబాబు ఉచిత విద్యుత్ సాధ్యం కాదు.. అదే చేస్తే రైతులు కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా నాటి సీఎల్పీ నేత వైఎస్సార్ తన పాదయాత్రలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. రైతులు కాంగ్రెస్ నేతగా వైఎస్సార్ ఇచ్చిన హామీని నమ్మారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అధికారంలోకి వస్తూనే నాటి కాంగ్రెస్ సీఎంగా ఉచిత విద్యుత్ నిర్ణయం పై తన ప్రమాణ స్వీకార వేదిక పైనే 2004లో సంతకం చేసారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు ప్రారంభం అయింది. ఆ తరువాత రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు తిరిగి రైతులు, మహిళలు, యువతే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం అవుతుంది. దీనిని పసిగట్టిన బీఆర్ఎస్ ఏం చేయాలో తెలియక, అంతు చిక్కని పరిస్థితుల్లో దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. రైతులకు ఇంకా ఎంత మేలు చేయాలని నిరంతరం ఆలోచించే పార్టీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేసారు. ఉచిత విద్యుత్ సమయాన్ని తగ్గించాలనే ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఖచ్చితంగా రైతు పక్షపాత పార్టీగా..అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి వారికి మేలు చేసే నిర్ణయాల దిశగానే అడుగులు వేస్తామని భట్టి స్పష్టంగా ప్రకటించారు.  ఇక పార్టీ క్యాంపెయనర్ గా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి అదే విషయాన్ని స్పష్టం చేసారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CLP leader Bhatti Vikramarka
  • congress
  • KomatiReddy Venkat Reddy
  • Power Politics
  • revanth reddy
  • tpcc

Related News

Janasena Pawan Kalyan

JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై జ‌డ్య‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆయనకే మద్దతు ఇస్తారన్నారు. జైలులో చంద్రబాబు నాయుడును కలవడమే పవన్‌కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ అని అనిరుధ్ రెడ్డి అన్నారు.పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాను ఆశిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

  • Balka Suman

    BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు

Latest News

  • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

  • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

  • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd