HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Four Railway Lines To Be Added Soon On Secunderabad To Kazipet Railway Route

Kazipet Railway Route : సికింద్రాబాద్‌- కాజీపేట రైల్వే మార్గం.. గుడ్ న్యూస్

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, చండీగఢ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, లక్నో సహా ఉత్తరాది రాష్ట్రాలకు కాజీపేట(Kazipet Railway Route) మీదుగానే రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

  • By Pasha Published Date - 10:47 AM, Wed - 30 April 25
  • daily-hunt
Secunderabad To Kazipet Railway Route Four Railway Lines Ghatkesar To Kazipet

Kazipet Railway Route : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఘట్‌కేసర్‌ నుంచి కాజీపేట వరకు 110.46 కి.మీ మేర రూట్‌లో రెండు రైల్వే లైన్‌లే ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు రైల్వే లైన్లను నాలుగుకు విస్తరించనున్నారు. అదనంగా రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయింది. దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించిన వివరాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను  తయారు చేసి ఇటీవలే రైల్వేబోర్డుకు పంపింది. ఈ అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి రూ.2,837 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు రైల్వే  బోర్డు నుంచి ఆమోదం లభిస్తే, రైల్వే శాఖ నుంచి ఈ ప్రాజెక్టుకు మంజూరు లభిస్తుంది. మంజూరు తేదీ నుంచి నాలుగేళ్లలోగా ఘట్‌కేసర్‌ టు కాజీపేట రూట్‌లో అదనంగా రెండు రైల్వే లైన్లను నిర్మిస్తారు. అంటే దాదాపు 2030 సంవత్సరం నాటికి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read :Maoist Top Leaders: ఏపీ – తెలంగాణ బార్డర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ?

ఘట్‌కేసర్‌ టు కాజీపేట రూట్ వస్తే.. ఏమవుతుంది ?  

  • దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సికింద్రాబాద్.
  • సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, చండీగఢ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, లక్నో సహా ఉత్తరాది రాష్ట్రాలకు కాజీపేట(Kazipet Railway Route) మీదుగానే రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
  • సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, కోల్‌కతాల వైపు వెళ్లే రైళ్లకు కూడా కాజీపేటనే ప్రధానమార్గం.
  • ప్యాసింజర్ రైళ్లు, గూడ్సు రైళ్ల రాకపోకలతో సికింద్రాబాద్ – కాజీపేట రైల్వే రూట్ నిత్యం కిటకిటలాడుతుంటుంది.
  • ఈ రూట్ నుంచే దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ఏటా భారీ ఆదాయం సమకూరుతోంది.
  • సెక్షన్‌ ట్రాక్‌ కెపాసిటీ వినియోగం 100 శాతంలోపు మాత్రమే ఉండాలని రైల్వే రూల్స్  చెబుతున్నాయి. అయితే ఇది సికింద్రాబాద్ – కాజీపేట రూట్‌లో 128 శాతంగా ఉంది.
  • కొత్తగా రెండు రైల్వే లైన్లను నిర్మించిన తర్వాతే..  ‘సెక్షన్‌ ట్రాక్‌ కెపాసిటీ వినియోగం’తో  ముడిపడిన సమస్య పరిష్కారం అవుతుంది.
  • ఈ మార్గంలో రైళ్ల హాల్టింగ్‌లు తగ్గుతాయి.
  • సికింద్రాబాద్ – కాజీపేట రూట్‌లో సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల కోసం రెండు ప్రత్యేక లైన్లను కేటాయిస్తారు. తద్వారా వాటిలోని ప్రయాణికులు వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలుగుతుంది.
  • ఈ రూట్‌లో గూడ్సు బండ్లకు ప్రత్యేక మార్గం అందుబాటులోకి వస్తుంది.
  • ఇక ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు కోసం మూడో రైల్వే లైను ఇప్పటికే మంజూరైంది.
  • ఘట్‌కేసర్‌-రాయగిరి వరకు నాలుగో లైను, రాయగిరి నుంచి కాజీపేట వరకు 3, 4 లైన్లను నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు.

Also Read :Operation Sandwich: పాకిస్తాన్‌ ముట్టడికి భారత్ బిగ్ ‘శాండ్‌విచ్’ స్కెచ్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Four Railway Lines
  • ghatkesar
  • Ghatkesar To Kazipet
  • Kazipet Railway Route
  • railway route
  • Secunderabad To Kazipet

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd