Operation Sandwich: పాకిస్తాన్ ముట్టడికి భారత్ బిగ్ ‘శాండ్‌విచ్’ స్కెచ్!
పాకిస్తాన్ సైనికుల్లో ఎక్కువమంది ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లలోనే(Operation Sandwich) ఉండేవారు.
- By Pasha Published Date - 08:35 AM, Wed - 30 April 25

Operation Sandwich: పాకిస్తాన్‌పై దాడి కోసం భారత్ భారీ స్కెచ్‌నే గీసినట్లు తెలుస్తోంది. దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ తప్పకుండా ప్రతిస్పందించే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ ప్రతిస్పందన తీవ్రంగా లేకుండా చేసేందుకు.. ఆ దేశంపై నలుమూలల నుంచి ఒత్తిడిాని పెంచేలా భారత ఆర్మీ స్కెచ్‌ను తయారు చేసిందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ఇటీవలే భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లి తాలిబన్ ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యారు. పాకిస్తాన్‌పై తాము దాడి చేస్తే సహకరించాలని కోరారు. అందుకు తాలిబన్లు ఓకేె చెప్పారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌కు మొదటి నుంచీ చాలా రకాలుగా సాయాన్ని భారత్ అందిస్తూ వస్తోంది. మరోవైపు తాలిబన్లతో పాకిస్తాన్‌కు కయ్యం నడుస్తోంది. కొన్ని నెలల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని అప్పట్లో తాలిబన్లు ప్రతిన బూనారు. ఆ ప్రతినను నిలబెట్టుకునే సమయం కోసం వాళ్లు ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయగానే.. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వైపు నుంచి పాకిస్తాన్‌పైకి దాడులు పెరిగే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ వేర్పాటువాద సంస్థల మిలిటెంట్లు కూడా తమ యాక్టివిటీని ముమ్మరం చేసే ఛాన్స్ ఉంది.
Also Read :India Vs Pakistan: 24 నుంచి 36 గంటల్లోగా భారత్ ఎటాక్ : పాకిస్తాన్
పాకిస్తాన్ సైనికుల్లో ఎక్కువమంది..
పాకిస్తాన్ సైనికుల్లో ఎక్కువమంది ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లలోనే(Operation Sandwich) ఉండేవారు. భారత్ దాడి చేయడానికి సిద్ధం కావడంతో.. ఆ ఆర్మీని భారత సరిహద్దులకు పంపారు.అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లలో తక్కువ సంఖ్యలో సైనికులు ఉన్నారు. దీన్ని అక్కడి మిలిటెంట్ సంస్థలు అదునుగా తీసుకొని దాడుల తీవ్రతను పెంచే అవకాశం ఉంది. అంటే ఓ వైపు భారత్ చేసే దాడి.. మరోవైపు తాలిబన్లు, బెలూచ్ మిలిటెంట్ల దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉంది.
ఐఎన్ఎస్ విక్రాంత్‌తో వాటిపై గురి
అంతేకాదు.. పాకిస్తాన్‌లోని కరాచీ, గ్వాదర్ పోర్టులకు చేరువలో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను భారత్ మోహరించనుంది. విమాన వాహక నౌక ఒంటరిగా వెళ్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. ప్రతీ విమాన వాహక నౌకతో పాటు యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, డెస్ట్రాయర్లు, డ్రోన్లు ప్రయాణం చేస్తుంటాయి. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో కరాచీ ఓడరేవుపైకి మిస్సైళ్లు విసిరిన చరిత్ర ఐఎన్ఎస్ విక్రాంత్‌కు ఉంది. ఈసారి కూడా ఆ సీన్ రిపీట్ అవుతుందేమో. పాకిస్తాన్‌కు గుండెకాయ లాంటి కరాచీ, గ్వాదర్ పోర్టులపై ఐఎన్ఎస్ విక్రాంత్ గురిపెట్టనుంది. ఇంకోవైపు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌ల పరిధి నుంచి భారత సైనికులు గ్రౌండ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేయనున్నారు. తద్వారా నలువైపుల నుంచి పాకిస్తాన్ దిగ్బంధంలో చిక్కుకోనుంది. ఒక శాండ్ విచ్‌లా నలిగిపోనుంది అని రక్షణరంగ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.