Kothapally Geetha: సీఎం జగన్ కుట్రవల్లే అరెస్ట్ అయ్యా …ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ గీత..!!
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టు అయ్యారు. రాయదుర్గం పాన్ మక్తా విలేజ్ లో సర్వే నెంబర్ 83 భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో...ఇవాళ ఆమెను సీబీఐ కోర్టు అరెస్టు చేసింది.
- Author : hashtagu
Date : 14-09-2022 - 10:04 IST
Published By : Hashtagu Telugu Desk
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టు అయ్యారు. రాయదుర్గం పాన్ మక్తా విలేజ్ లో సర్వే నెంబర్ 83 భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో…ఇవాళ ఆమెను సీబీఐ కోర్టు అరెస్టు చేసింది. అయితే గతంలో కొత్తపల్లి గీత ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ తెలంగాణ లో ప్రాపర్టీ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు.ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే అన్నారు గీత. ప్రైమ్ పాపర్టీలో ఉన్న వారిని తరిమేయాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. జగన్ తో తనకున్న విభేదాల కారణంతోపాటు…జగన్, కేటీఆర్ కు మంచి సంబంధాలు ఉండటంతో కావాలనే తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గీత ఆరోపించారు. ప్రభుత్వం కూడా ఏనాడు అది ప్రభుత్వ భూమి అని చెప్పలేదన్నారు. కేవలం భూమి తక్కువగా ఉండటంతో తమ భూమిలో నుంచి తీసుకున్నట్లు గీత చెప్పుకొచ్చారు.