Rain Effect : భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు
సాధారణంగా కంటే ధరలు రెండింతలు పెంచి టికెట్లు విక్రమాయిస్తున్నారు. అలాగే విమానాలు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి
- By Sudheer Published Date - 06:05 PM, Mon - 2 September 24
ప్రయాణికులకు భారీ షాక్ ఇస్తున్నాయి విమానయాన సంస్థలు. గత నాల్గు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడం తో జనజీవనం స్థంభించింది. చెరువులు , వాగులు పొంగిపొర్లడం తో అనేక చోట్ల రోడ్లు , రైల్వే ట్రాక్ లు తెగిపోయి రవాణా వ్యవస్థ ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ – హైదరాబాద్ దారులు బంద్ అయ్యాయి. పాలేరు, మున్నేరు ఉదృతి ఎక్కువగా ఉండడం తో అనేక చోట్ల రహదారులు తెగిపోయాయి. దీంతో ఎక్కడిక్కడే వాహనాలు ఆగిపోయాయి.
We’re now on WhatsApp. Click to Join.
అటు విజయవాడ- హైదరాబాద్- విశాఖ- చెన్నై మధ్య పలు రైళ్లను రద్దు చేయడం తో..ప్రయాణికులు విమానాలను ఆశ్రయిస్తున్నారు. శంషాబాద్ – గన్నవరం ఎయిర్ పోర్ట్ లకు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. దీంతో విమాన చార్జీలు అమాంతం పెంచేసాయి విమానయాన సంస్థలు. సాధారణంగా కంటే ధరలు రెండింతలు పెంచి టికెట్లు విక్రమాయిస్తున్నారు. అలాగే విమానాలు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రైళ్లు, బస్సులు లేక విమానాల కోసం ఎయిర్ పోర్టుకు వస్తే ఇక్కడ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం తగ్గినప్పటికీ..వరదలు మాత్రం ఇంకా ప్రవహిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ లు పూర్తిగా నిండడం తో అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో అనేక గ్రామాలు వరదలు చిక్కుతున్నాయి. మరోపక్క రెండు ప్రభుత్వాలు సైతం సహాయక చర్యలు ముమ్మరం చేసాయి. ఇద్దరు సీఎంలు స్వయంగా రంగంలోకి దిగి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
Read Also : KTR : వరద బాధిత కుటుంబాలకు రూ.25 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
Related News
Whiskey Ice Cream: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విస్కీ ఐస్ క్రీమ్ కుంభకోణం
చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు ఇష్టపడని పిల్లలంటూ ఎవరూ ఉండరు. జలుబు చేస్తుందని హెచ్చరిస్తున్నా..డాక్టర్లు వద్దని అంటున్నా..రహస్యంగా కొనుక్కున ఆస్వాదిస్తుంటారు. అయితే చిన్నారుల వీక్ నెస్ ని ఇంకోలా క్యాష్ చేసుకోవాలని కొందరిలో దుర్మార్గమైన ఆలోచన మెదిలింది.