HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Fake Interviews In Telangana Many Youths Are Trapped By Fake Jobs

Fake Interviews: ఫేక్ ఇంటర్వ్యూలు.. ఫేక్ జాబ్స్‌.. వందలాది యువతకు కుచ్చుటోపీ

సదరు ఫేక్ జాబ్(Fake Interviews) కన్సల్టెన్సీ.. పలు నకిలీ మెయిల్ ఐడీల నుంచి దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్ లెటర్లను పంపింది.

  • Author : Pasha Date : 16-02-2025 - 9:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fake Interviews Fake Jobs Hyderabad Telangana Youth

Fake Interviews: రైల్వే, విమానాశ్రయం, సైబర్‌క్రైమ్‌ విభాగాల్లో జాబ్స్ ఇప్పిస్తామన్నారు. నిరుద్యోగ యువత నుంచి భారీగా డబ్బులు గుంజారు. మేమే హెచ్‌ఆర్ మేనేజర్లం అంటూ ఇంటర్వ్యూలు చేశారు. వివిధ కంపెనీల పేరుతో నకిలీ మెయిల్ ఐడీలను క్రియేట్ చేసి, వాటి నుంచి కాల్ లెటర్లు పంపారు. మన దేశంలో, విదేశాల్లోనూ జాబ్స్ ఇప్పిస్తామంటూ  ఒక్కో అభ్యర్థి నుంచి రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షల దాకా తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని ఒక ఫేక్ జాబ్ కన్సల్టెన్సీ ఈవిధంగా మోసపూరిత దందా నడిపింది. ఇది దాదాపు రూ.3.5 కోట్లు సేకరించి బిచాణా ఎత్తేసింది.  బాధితుల నుంచి పోలీసులకు కంప్లయింట్ రావడంతో బండారం వెలుగుచూసింది.

Also Read :Satellite Telecom: మనకూ శాటిలైట్‌ టెలికాం.. ఛార్జీ ఎంత ? ఏ కంపెనీలు కనెక్షన్ ఇస్తాయి ?

హెచ్‌ఆర్ విభాగాల షాక్

సదరు ఫేక్ జాబ్(Fake Interviews) కన్సల్టెన్సీ.. పలు నకిలీ మెయిల్ ఐడీల నుంచి దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్ లెటర్లను పంపింది. వాటిని తీసుకొని అభ్యర్థులంతా, అందులో ఉన్న అడ్రస్‌ ప్రకారం ఆయా కంపెనీలకు వెళ్లారు. తాము ఉద్యోగంలో చేరడానికి వచ్చామని చెప్పారు. ఆ  అపాయింట్‌మెంట్ లెటర్లను పరిశీలించిన సదరు కంపెనీల హెచ్‌ఆర్ విభాగాలు షాకింగ్ విషయాన్ని వినిపించాయి. అవన్నీ ఫేక్ నియామక ఉత్తర్వులను తేల్చి చెప్పాయి. ఎవరో మిమ్మల్ని మోసం చేసి ఉంటారని తెలిపాయి. దీంతో తాము మోసపోయామని బాధిత నిరుద్యోగ యువత గుర్తించారు. ఆ ఫేక్ జాబ్ కన్సల్టెన్సీ నిర్వహించిన ఇంటర్వ్యూలన్నీ ఫేక్ అని తేలింది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తులు అసలైన కంపెనీల హెచ్‌ఆర్ మేనేజర్లు కాదని, వాళ్లంతా బ్రోకర్లే అని వెల్లడైంది. లక్షల శాలరీ ప్యాకేజీ వస్తుందంటే ఆశపడి యువత.. సదరు ఫేక్ జాబ్ కన్సల్టెన్సీకి లక్షలు ఇచ్చుకున్నారు.

Also Read :Indsol Company : కూటమి ప్రభుత్వానికి బెదిరింపు లేఖ

980 మందికి కుచ్చుటోపీ

2024 సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉద్యోగాల పేరిట 980 మంది యువత మోసపోయారు. వాళ్లు ఫేక్ జాబ్ కన్సల్టెన్సీలకు ఇచ్చుకున్న డబ్బు మొత్తం విలువ దాదాపు రూ.10 కోట్ల దాకా ఉంటుంది. ఈ సంవత్సరం (2025) తొలి 50 రోజుల్లో ఈవిధంగా 60 మందికి పైగా యువత మోసపోయారు. ఉద్యోగాల కోసం లక్షలాది రూపాయలు ఇచ్చుకొని దగాపడ్డారు.  వారి నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇలాంటి మోసాల బారినపడిన వారు తప్పకుండా 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సైబర్‌క్రైమ్‌ డీసీపీ కవిత దార సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fake Interviews
  • Fake jobs
  • hyderabad
  • jobs
  • telangana
  • Telangana youth

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

    Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd