Fake Drugs : హైదరాబాద్లో భారీగా నకిలీ డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్‌లో భారీగా నకిలీ డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు బుధవారం ఉప్పల్,
- Author : Prasad
Date : 04-01-2024 - 8:40 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లో భారీగా నకిలీ డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు బుధవారం ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్‌లో జరిపిన సోదాల్లో రూ.22.95 లక్షల విలువైన నకిలీ డ్రగ్స్‌ని పట్టుకున్నారు. డిసెంబర్ 30 న, DCA అధికారులు ఒక కొరియర్, Trackon Couriers Pvt. Ltd, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఐదు కార్టన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నకిలీ డ్రగ్స్ రాకెట్‌లో నిందితుడైన పువ్వాడ లక్ష్మణ్ అనే వ్యక్తి పేరుతో ఉంది. బుధవారం సురేష్ కుమార్ అనే డెలివరీ బాయ్ కొరియర్ తీయడానికి వచ్చి దిసుఖ్‌నగర్‌లోని ద్వారకాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్ అనే గోడౌన్‌కు వెళ్లాడు. పువ్వాడ లక్ష్మణ్‌తో పాటు అతని సహచరులు సైదాబాద్‌కు చెందిన పోకల రమేష్, గారపల్లి పూర్ణచందర్‌లను పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. ఈ దాడిలో.. DCA అధికారులు 51,000 యాంటీబయాటిక్ టాబ్లెట్లను Cefoxim-CV మాత్రలు (Cefpodoxime Proxetil & Potassium Clavulanate, Lactic Acid Bacillus మాత్రలు) కనుగొన్నారు. ‘మెగ్ లైఫ్‌సైన్సెస్, ఖాసారా నెం. 47/5, పల్లి గావ్, సిర్మూర్, హిమాచల్ ప్రదేశ్’ పేరుతో ఈ ట్యాబ్లెట్‌లు తయారు చేశారని పోలీసులు తెలిపారు. ఇవి నకిలీ చిరునామాగా గుర్తించబడ్డాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అవుతారా..? ఢిల్లీలో ఏం జరగబోతుంది..?