HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ex Minister Shabbir Ali Support To Beedi Workers

TCongress : బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది – టీకాంగ్రెస్ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ

బీడీ కార్మికుల జీవనోపాధి, ఆరోగ్యం, మనుగడకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని మాజీ మంత్రి,

  • Author : Prasad Date : 30-01-2023 - 6:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shabbir Ali
Shabbir Ali

బీడీ కార్మికుల జీవనోపాధి, ఆరోగ్యం, మనుగడకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ బీడీ కార్మికులకు హామీ ఇచ్చారు. ‘హాత్ సే హాత్ జోడో’ అభియాన్‌లో భాగంగా.. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో షబ్బీర్ అలీ బీడీ కార్మికులు, తేకేదార్ పరిశ్రమకు సంబంధించిన ఇతరులతో స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలోని 14 ప్రధాన బీడీ పరిశ్రమల ద్వారా దాదాపు ఏడు లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం బీడీ కార్మికులలో పేదరికాన్ని నిర్మూలించడానికి లేదా వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఏమీ చేయలేదని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణలోని బీడీ కార్మికుల స్థితిగతులపై ఇటీవల జరిపిన అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ.. కార్మికులు త‌క్కువ వేతనాలను పొందుతున్నారని, దళారుల దోపిడీని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

బీడీ కార్మికుల‌కు సామాజిక భద్రత లేదన్నారు. ప్రధానంగా మహిళలు బీడీలపై ఆధారపడి జీవిస్తున్నారని.. చాలా మంది బీడీ కార్మికులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ష‌బ్బీర్ అలీ తెలిపారు. అయితే వారికి వైద్య సదుపాయాలు అందడం లేదన్నారు. కామారెడ్డితో సహా దేశంలో ఎక్కడా కనీసం బీడీ కార్మికులకు ఈఎస్‌ఐ ఆస్పత్రి లేదు. బీడీ పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ విధించడంపై బీజేపీపై మండిపడ్డారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ మొత్తం పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకే ఈ చర్య తీసుకుందని ఆయన అన్నారు. పొగాకును నిరుత్సాహపరిచే పేరుతో పేద బీడీ కార్మికులను మోదీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బీడీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకున్నార‌ని. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ పరిశ్రమ నుంచి జీఎస్టీని తొలగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమల నుంచి కేంద్రం ఏటా రూ.100 కోట్లు సెస్ రూపంలో వసూలు చేస్తుందన్నారు. కానీ కార్మికులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ఎలాంటి పథకాలు లేవని… బీడీ కార్మికులకు కేంద్రం సరైన వేతనాలు నిర్ణయించాలని, బీడీ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న కార్మికులందరికీ పీఎఫ్ కార్డులు ఇవ్వాలని ష‌బ్బీర్ అలీ డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beedi workers
  • congress
  • T congress
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd