Etala Rajender : రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయి
రుణమాఫీలో నిబంధనలు పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందన్నారు. పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు.
- By Latha Suma Published Date - 05:03 PM, Tue - 16 July 24

Etala Rajender: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రుణమాఫి నిబంధనలపై స్పదించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతు(Farmer) ఏడ్చిన రాజ్యం బాగుడదని అన్నారు. ఒట్టులు వేసి..దేవుళ్ళను కూడా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మోసం చేశారని విమర్శలు గుప్పించారు. రుణమాఫీలో నిబంధనలు పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందన్నారు. పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రుణమాఫీ(Loan waiver) నియమనిబంధనలు రైతులకు ఉరి తాళ్ళుగా మారతాయన్నారు. రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మోసం చేయాలని చూస్తారని గతంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారని ఈ సందర్భంగా ఈటల గుర్తు చేశారు. ప్రజల ఆలోచన పట్ల రేవంత్ రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ.. అవమానాన్ని భరించరన్నారు. మోసగాళ్ళను, మాట ఇచ్చిన తప్పినవారిని అంతిమంగా ప్రజలు బొంద పెడతారని హెచ్చరించారు. అతి తక్కువ కాలంలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన సీఎం రేవంత్ రెడ్డి అని ఎంపీ విరుచుకుపడ్డారు.
Read Also: David Warner: వార్నర్ కు ఝలక్ ఇచ్చిన ఆస్ట్రేలియా సెలెక్షన్ కమిటీ
కాగా, మరోసారి మోసగించబడ్డామని అన్ని వర్గాల ప్రజలు అంటున్నారన్నారు. ఐదేళ్ళు అధికారం ఇచ్చారని… ఇష్టం వచ్చినట్లు చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారన్నారు. గతంలో విమర్శలు చేసిన రేవంత్.. ఏడు నెలల నుంచి రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో చిత్తు కాగితంతో సమానమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇతర పార్టీల ఎమ్మెల్యేల మీద ఉన్న ద్యాస.. ప్రజా సమస్యలపై లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే దమ్ము లేదని.. పేదల ఇళ్ళు కూలగొట్టటమే పనిగా రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుకుందని ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
.Read Also: Doda Encounter: ఇంతకీ కాశ్మీర్ టైగర్స్ ఎవరు ?