Dry Port In Telangana : తెలంగాణలోనూ డ్రై పోర్ట్ నిర్మాణం.. ఇంతకీ అదేమిటి ?
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా తూప్రాన్ సమీపంలో ఉన్న మనోహరాబాద్‌లో డ్రైపోర్ట్‌ను(Dry Port In Telangana) నిర్మించనున్నారు.
- By Pasha Published Date - 03:14 PM, Sun - 2 February 25

Dry Port In Telangana : డ్రై పోర్ట్.. తెలంగాణ రాష్ట్రంలోనూ ఏర్పాటు కాబోతోంది. సాధారణంగా పోర్ట్ అంటే ఓడరేవు. సముద్ర తీరాలు ఉన్నచోటే పోర్ట్‌లను ఏర్పాటు చేస్తారు. మరి.. ‘డ్రై పోర్ట్’ అంటే ఏమిటి ? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. ఇంతకీ తెలంగాణలో డ్రై పోర్ట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ? అనే వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :IND-W Beat SA-W: ప్రపంచకప్ గెలిచిన భారత్.. మరోసారి ఆకట్టుకున్న తెలుగమ్మాయి!
డ్రైపోర్ట్ తెలంగాణలో ఎక్కడ ఏర్పాటవుతుంది ?
- తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా తూప్రాన్ సమీపంలో ఉన్న మనోహరాబాద్‌లో డ్రైపోర్ట్‌ను(Dry Port In Telangana) నిర్మించనున్నారు.
- మనోహరాబాద్ ప్రాంతం జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. అందుకే అక్కడ డ్రైపోర్టును నిర్మిస్తున్నారు.
- ఈ డ్రైపోర్టు నుంచి మచిలీపట్నం పోర్టుకు మార్గాన్ని అనుసంధానించడం చాలా ఈజీ.
- దీన్ని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మిస్తాయి.
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో డ్రై పోర్ట్ నిర్మాణం జరుగుతుంది.
- దీని నిర్మాణం కోసం 350 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది.
- డ్రైపోర్ట్ నిర్మాణంపై ఇప్పటికే ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.
- ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా డ్రై పోర్ట్‌పై ప్రకటన చేశారు. దీంతో మరోసారి దీనిపై చర్చ జరుగుతోంది.
- ఈనెలలోనే (ఫిబ్రవరి) డ్రై పోర్ట్ నిర్మాణంపై విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది.
Also Read :Baba Ramdev : బాబా రాందేవ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. ఏ కేసులో ?
డ్రై పోర్ట్ అంటే ఏమిటి?
డ్రై పోర్ట్‌కు కొన్ని వేరే పేర్లు కూడా ఉన్నాయి. దాన్ని ఇన్‌ల్యాండ్ పోర్ట్, మల్టీమోడల్ లాజిస్టిక్స్ సెంటర్ అని సైతం పిలుస్తారు. డ్రై పోర్ట్‌లను రైలు, రోడ్డు మార్గాల ద్వారా సమీపంలో ఉండే ఓడ రేవులకు లింక్ చేస్తారు. డ్రై పోర్ట్‌లు ఎగుమతి, దిగుమతులకు రవాణా కేంద్రంగా పనిచేస్తాయి. సముద్రానికి దగ్గరగా ఉండదు కాబట్టే.. దీన్ని డ్రై పోర్ట్ అని పిలుస్తారు. సముద్ర తీరాల్లో ఉండే సీ పోర్టులలో రద్దీని తగ్గించడానికే డ్రై పోర్ట్‌లను ఉపయోగిస్తుంటారు. డ్రైపోర్టులలో కంటైనర్ యార్డులు, వేర్‌హౌస్‌లు, రైల్వే సైడింగ్స్, కార్గో నిర్వహణ సామగ్రి, ఎగుమతులు, దిగుమతుల క్లియరెన్స్‌కు డ్రై పోర్ట్‌లో అధికార యంత్రాంగం, ఇతర వ్యవస్థ ఉంటాయి. వీటిలోనూ కస్టమ్స్ వ్యవస్థ ఉంటుంది. తనిఖీలు చేస్తారు. ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన పేపర్ వర్క్ చేస్తారు.