Telangana Govt : ఉగాది నుండి సన్నబియ్యం పంపిణీ
Telangana Govt : ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందుబాటులోకి వస్తుంది
- By Sudheer Published Date - 10:51 AM, Thu - 20 March 25

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉగాది (Ugadi) పర్వదినం నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం (Brown Rice) పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CMRevanth) ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వ అధికారుల ప్రకారం ఈ బియ్యం ప్రస్తుత బియ్యంతో పోలిస్తే మెరుగైన పోషక విలువలు కలిగి ఉంటుంది.
BHIM-UPI: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. యూపీఐ చెల్లింపులతో బంపర్ ఆఫర్లు!
ప్రభుత్వం ఇప్పటికే గోదాముల్లో పెద్ద ఎత్తున సన్నబియ్యం నిల్వలు సిద్ధం చేసిందని, ఇవి నాలుగు నెలల పాటు సరిపోతాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 91,19,268 రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరి ద్వారా సుమారు 2,82,77,859 మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని ఉపయోగించుకోనున్నారు. ప్రజలకు ఉత్తమమైన ఆహార భద్రత అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
సన్నబియ్యం పంపిణీపై లబ్ధిదారులు, ప్రజా సంఘాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఇది పౌష్టికాహారాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మార్పును అమలు చేసే విధానం, రేషన్ షాపుల వద్ద సరఫరా క్రమం సమర్ధవంతంగా ఉండాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, నాణ్యత విషయంలో రాజీపడకూడదని లబ్ధిదారులు కోరుతున్నారు.