Telangana Politics: కేసీఆర్ చెప్పాల్సిన వార్త…మల్లారెడ్డి చెప్పేశాడా..?
త్వరలోనే సంచలన వార్త చెబుతా..ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోట నుంచి వచ్చిన వార్త.
- By Hashtag U Published Date - 01:05 PM, Sat - 28 May 22

త్వరలోనే సంచలన వార్త చెబుతా..ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోట నుంచి వచ్చిన వార్త. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే ఆ సంచలన వార్త ఏమై ఉంటుందన్న ఆసక్తి సర్వాత్రా వ్యక్తమవుతోంది. ఇలాంటి సందర్భంలో…పలు వాదనలు కూడా తెరమీదకు వస్తున్నాయి. శుక్రవారం నాడు హన్మకొండ జిల్లా కాజీపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్మిక సదస్సుకు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. సభలో మాట్లాడుతూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుశా సీఎం కేసీఆర్ చెబుతానన్న సంచలన వార్త ఇదేనేమో అన్నభావన అందరీలోనూ కలుగుతోంది.
అసలు మ్యాటరేంటంటే…వచ్చే దసరా రోజున సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పటానికి వెళ్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. తాను చెప్పినమాట….ఏదో హడావుడిగా చెప్పింది కాదని…ఇదే కాకుండా మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. దసర రోజున వరంగల్ లోని భద్రాకాళి అమ్మవారికి పూజలు చేసి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతారంటూ…మల్లారెడ్డి చెప్పిన మాటలు చూస్తుంటే కేసీఆర్ చెబుతానన్నది ఈ సంచలన వార్తనే కావొచ్చన్న అనుమానం కలగక మానదు.
కాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు మల్లారెడ్డి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్నారు. రేవంత్ రెడ్డి కొత్త బిచ్చగాడిలా వ్యవహిరస్తున్నట్లు చెప్పాడు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదన్న మల్లారెడ్డి…మాటలను పక్కన పెడితే…దసరా రోజు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా కేసీఆర్ ముహుర్తాన్ని సిద్ధం చేసుకున్నారన్నది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.